Sridhar Babu: మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
ABN, Publish Date - Sep 29 , 2024 | 05:38 PM
హైదరాబాద్‌ను వరల్డ్ బెస్ట్ సిటీగా మారుస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పీపీపీ కింద మూసీ ప్రాజెక్ట్ చేపడతామని ప్రకటించారు. మూసీలోకి గోదావరి నీళ్లు తీసుకువస్తామని అన్నారు. మూసీపై లింక్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళనపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.
హైదరాబాద్: మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేర్చుతామని అన్నారు. సొంతిల్లు లేనివారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ(ఆదివారం) తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పేదవారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్‌బాబు మాటిచ్చారు.
ALSO READ: MLA RajaSingh: హత్యకు రెక్కీ.. స్పందించిన రాజాసింగ్
అందరినీ కాపాడుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌ను వరల్డ్ బెస్ట్ సిటీగా మారుస్తామని అన్నారు. పీపీపీ కింద మూసీ ప్రాజెక్ట్ చేపడతామని ప్రకటించారు. మూసీలోకి గోదావరి నీళ్లు తీసుకువస్తామని అన్నారు. మూసీపై లింక్ రోడ్లు నిర్మిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. మూసీ ప్రక్షాళనపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా ఏం చేసింది? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు.
ALSO READ: MLA: హైడ్రా కూల్చివేతలు అన్యాయం: ఎమ్మెల్యే
మల్లన్న సాగర్ నిర్వాసితులకు బీఆర్ఎస్ ఏం చేసింది అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. గతంలో తాము మల్లన్నసాగర్ దగ్గరకు వెళ్తే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. పోలీసులతో తమను అరెస్టు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు తాము బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నామా అని మంత్రి శ్రీధర్‌బాబు నిలదీశారు.
ALSO READ: Collector: అధైర్యపడొద్దు.. ఇళ్లు ఇస్తాం..
కొంతమంది అవకాశవాదులు కాంగ్రెస్ నేతలను రెచ్చగొట్టే పనిలో ఉన్నారని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ఎఫ్‌టీఎల్ పరిధిని దాచిపెట్టి విక్రయాలు చేసిన బిల్డర్లపై చర్యలు తీసుకుంటామని శ్రీధర్‌బాబు హెచ్చరించారు. మూసీని పరిరక్షించుకోవాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని.. అందుకోసం చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Danam Nagender: కాంగ్రెస్‌లో చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధం.
Minister Uttam: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం..
Minister Ponnam: ఆ విషయంలో సోషల్ మీడియా పుకార్లు నమ్మెుద్దు: మంత్రి పొన్నం..
Read Latest Telangana News and Telugu News
Updated Date - Sep 29 , 2024 | 05:46 PM