Share News

Rythu Bharosa : రైతు భరోసాపై కీలక అప్‌డేట్.. మంత్రి తుమ్మల ఏమన్నారంటే..

ABN , Publish Date - Dec 31 , 2024 | 04:50 PM

Rythu Bharosa: రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. కేబినేట్ సబ్ కమిటీ కేవలం విధి విధానాల మీద చర్చ మాత్రమే చేశామన్నారు. ఈ రోజు ఈ నిమిషం వరకు రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం చేయనటువంటి ప్రభుత్వంపై ప్రసార సాధనాల ద్వారా కానీ ప్రతి పక్షాలు దుష్పచార చేసే ఆలోచన చేయొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Rythu Bharosa : రైతు భరోసాపై కీలక అప్‌డేట్.. మంత్రి తుమ్మల ఏమన్నారంటే..
Rythu Bharosa

ఖమ్మం: రైతు భరోసా మీద తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సత్తుపల్లి శివారు వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ(మంగళవారం) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాలనలో రూ. 21 వేల కోట్ల రుణామాఫీ, రూ.7,625 వేల కోట్ల రైతు బంధు, రూ. 3 వేల కోట్ల రైతు భీమా ఇచ్చిందని ప్రకటించారు. సన్న ధాన్యానికి బోనస్ ఇచ్చామని స్పష్టం చేశారు. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలనేదే స్థూలంగా తమ ప్రభుత్వం ఆలోచన అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.


రైతు భరోసా మీద ఎలాంటి నిబంధనలు కానీ పంట వేయనటువంటి రైతులను తగ్గించటం కోసం చేసే ప్రయత్నం కానీ తమ ప్రభుత్వం ఇంత వరకు ఏ విధమైన ఆలోచన చేయలేదని అన్నారు. కేబినెట్ సబ్ కమిటీ కేవలం విధి విధానాల మీద చర్చించడం మాత్రమే చేశామన్నారు. ఈ రోజు ఈ నిమిషం వరకు రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం చేయనటువంటి ప్రభుత్వంపై ప్రసార సాధనాల ద్వారా కానీ ప్రతి పక్షాలు దుష్పచార చేసే ఆలోచన చేయొద్దని తెలిపారు. రైతు భరోసాపై తాము చేసిన చర్చల ఫలితాలను కేబినెట్‌లో పెడతామని అన్నారు. రైతు భరోసాపై కేబినెట్ నిర్ణయమే తుది నిర్ణయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Happy New Year 2025: ఫుల్ కిక్‌లో మందుబాబులు.. మూడ్రోజుల్లో ఎంత తాగారంటే..

KTR: మరోసారి కాంగ్రెస్ సర్కార్‌పై దుమ్మెత్తిపోసిన కేటీఆర్

Metro Rail: మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్

For More Telangana And Telugu News

Updated Date - Dec 31 , 2024 | 04:54 PM