ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Thummala: గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలి

ABN, Publish Date - Jul 27 , 2024 | 10:04 PM

గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు. గోదావరి వరదలపై భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు.

భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు. గోదావరి వరదలపై భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీవో రాహుల్ పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు వర్షాల నేపథ్యంలో సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. సమావేశం అనంతరం మీడియాతో మంత్రి తుమ్మల మాట్లాడారు.


భద్రాచలానికి కరకట్ట శ్రీ రామరక్ష..

గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదల వల్ల ఎక్కడ ప్రాణ నష్టం వాటిళ్లకుండా చూడాలని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వరద నీరు భద్రాచలంలోకి రాకుండా తాత్కాలిక కట్ట నిర్మాణం చేశామని వివరించారు. చుక్క నీరు భద్రాచలంలోకి రాకుండా కట్ట అడ్డుకుందని చెప్పారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో జాతీయ రహదారి ఎత్తుగా నిర్మాణం చేస్తే వరద పోటు ఉండదని స్పష్టం చేశారు. భద్రాచలానికి శ్రీ రామరక్షగా కరకట్ట దగ్గర నిలిచిపోయిన విస్తరణ పనులు తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందని తెలిపారు. భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆశీస్సులతో గోదావరి వరదల నుంచి తమ ప్రభుత్వం భద్రాచలం పట్టణానికి శాశ్వత పరిష్కారం చేస్తామని అన్నారు.


గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి

అంతకుముందు.. ఏన్కూర్ మండలం ఇమామ్ నగర్ వద్ద వైరా లింక్ కెనాల్ పనులను మంత్రి తుమ్మల పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఆగస్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నాటికి పనులు పూర్తి అయ్యేలా చూడాలని మంత్రి తుమ్మల సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతిని, నూతన బ్రిడ్జి వద్ద గోదావరి వరద ఉధృతి, భద్రాచలం నుంచి ఆంధ్రా ఒడిషా ఛత్తీస్ గడ్ వెళ్లే జాతీయ రహదారిపై కరకట్ట విస్తరణ పనులను, భద్రాచలం సరిహద్దులో జాతీయ రహదారిపై తాత్కాలిక ఆనకట్టాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.


కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

తాత్కాలిక ఆనకట్టతో భద్రాచలం పట్టణంలోకి వరద నీరు రాకుండా అడ్డుకట్టగా నిలవడంతో మంత్రి తుమ్మలపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు.

కాగా.. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. 52.70 అడుగుల వద్ద 14,09,734 క్యూసెక్కుల వరద ఉధృతి ప్రవహిస్తోంది. గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. భద్రాచలం నుంచి ఆంధ్రా ఒడిషా ఛత్తీస్ గడ్ కు రాకపోకలు నిలిచి పోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల స్టేట్ హైవే పై రాకపోకలు నిలిచాయి. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీకానున్నది.

Updated Date - Jul 27 , 2024 | 10:07 PM

Advertising
Advertising
<