ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kodandaram: కేసీఆర్ ప్రభుత్వ విధానాలతోనే నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు

ABN, Publish Date - Oct 20 , 2024 | 04:04 PM

సీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి తీసుకున్న చర్యలు ఏమి లేవని ఎమ్మెల్సీ కోదండరాం దుయ్యబట్టారు. నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీ మీద ఎన్నిసార్లు అడిగిన వివరాలు ఇవ్వలేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చొరవ చూపుతుందని తెలిపారు.

నిజామాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలతోనే నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయిందని మండిపడ్డారు. ఇవాళ(ఆదివారం)నిజామాబాద్‌లో అభినందన సభ జరిగింది. ఈ సభలో కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ...గ్రూప్ - 1 ఎగ్జామ్స్ మీద బీఆర్ఎస్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు.


కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి తీసుకున్న చర్యలు ఏమి లేవని దుయ్యబట్టారు. నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీ మీద ఎన్నిసార్లు అడిగిన వివరాలు ఇవ్వలేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చొరవ చూపుతుందని తెలిపారు. జీవో 55, 29 ల అమలు వెనుక కోర్టు సూచనలున్నాయన్న సంగతి తెలుసుకోవాలని చెప్పారు.


తమ పార్టీ అప్పుడు, ఇప్పుడు నిరుద్యోగ సమస్యపై పోరాడుతూనే ఉందని తెలిపారు. తమ ఆందోళనలు, సూచనలను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. ఉద్యోగాల భర్తీ మీద బీఆర్ఎస్ పార్టీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. నిరుద్యోగులను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. దీన్ని సహించేది లేదని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Tummala: రైతుబంధు పేరుతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోచిపెట్టారు... మంత్రి తుమ్మల ధ్వజం

ABN Effect: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో HMDA అధికారుల్లో కదలిక..

Group-1 Exam: మరోసారి రోడ్డెక్కిన గ్రూప్-1 బాధితులు.. అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత..

HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

For Telangana News And Telugu News...

Updated Date - Oct 20 , 2024 | 04:05 PM