ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PONNAM PRABHAKAR: అమిత్ షాపై ఆ కేసు బుక్ చేయాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్

ABN, Publish Date - Dec 19 , 2024 | 01:17 PM

స్వాతంత్య్ర పోరాటం చేస్తుంటే బీజేపీ నేతలు బ్రిటిష్ వారికి తాబేదార్లుగా పని చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని అన్నారు.

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అట్రాసిటీ కేసు బుక్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అంబేద్కర్‌పై బీజేపీ స్టాండ్ ఎంటో అమిత్ షా బయట పెట్టారని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. అమిత్ షా వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించాలన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ పాత్రనే లేదని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర పోరాటం చేస్తుంటే బీజేపీ నేతలు బ్రిటిష్ వారికి తాబేదార్లుగా పని చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.


అమిత్ షా వ్యాఖ్యలు దేశ ప్రజల గుండెలను గాయపరిచింది: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

అంబేద్కర్ తమకు దేవుడు లాంటివారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు దేశ ప్రజల గుండెలను గాయపరిచిందని చెప్పారు. అమిత్ షా మాట్లాడిన భాష మనువాద సంస్కృతిని గుర్తు చేసిందని అన్నారు. అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్, సీఎల్పీ డిమాండ్ చేస్తోందని మహేష్ గౌడ్ అన్నారు.


అమిత్ షా క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల అమర్యాదగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంట్‌ ఎదుట కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాజ్యసభలో అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే వారికి రాజ్యాంగం పట్ల నమ్మకం, గౌరవం లేదని అర్థమవుతుందని తెలిపారు.


మొన్నటి రోజు రాజ్యసభలో అమిత్ షా మాట్లాడిన మాటలను తాను మాట్లాడలేదు ఎవరో ఎడిట్ చేశారని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమిత్ షా చేసిన తప్పును కప్పి పుచ్చుకొని దేశ ప్రజలను బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అంబేద్కర్ పట్ల ఆమర్యాదగా మాట్లాడి బీజేపీ నాయకుల మనసులో ఏముందో వెలిబుచ్చారని అన్నారు. బీజేపీ నేతలకు త్రివర్ణ పతాకం పట్ల కూడా భక్తి లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Revanth Reddy: అదానీకి ప్రధాని అండ

AV Ranganath: ఆక్రమణదారులపై పీడీ యాక్ట్‌.. హైడ్రా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు తర్వాత చర్యలు

Hyderabad: అనుమతి నుంచి రెన్యూవల్‌ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Dec 19 , 2024 | 01:31 PM