Raghunandan Rao: అల్లు అర్జున్ ఎపిసోడ్... రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Dec 24 , 2024 | 02:57 PM
నటుడు అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయం చేస్తున్నారని మెదక్ ఎంపీ రఘు నందన్ రావు విమర్శించారు. ప్రభుత్వం రేవంత్ చేతిలో ఉందని... బాధితులకు ఏం అనుకుంటే అది చేయొచ్చని అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉడతా బెదిరింపులకు సినిమా ఇండ్రస్టీనే కాదు.. ఏ ఇండ్రస్టీ కూడా భయపడదని బీజేపీ ఎంపీ రఘు నందన్ రావు అన్నారు. నటుడు అల్లు అర్జున్ విషయంలో అత్యుత్సాహం తప్పితే ఏం లేదని చెప్పారు. అల్లు అర్జున్‌కు సంధ్య థియేటర్ దగ్గరకు అనుమతి లేనప్పుడు ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చినప్పుడు ముందస్తు హౌస్ అరెస్ట్‌లు చేస్తారని.. మరి అల్లు అర్జున్ అంశంలో పోలీసులు ఎందుకు హౌస్ అరెస్ట్ చేయకుండా వదిలేశారని రఘు నందన్ రావు నిలదీశారు.
అల్లు అర్జున్ సమస్య ప్రస్తుతం కోర్టులో ఉందని.. దీనిపై ఎవరు ఎలాంటి కామెంట్ చేయలేరని అన్నారు. ఇవాళ(మంగళవారం) ఏబీఎన్‌తో రఘునందన్‌రావు మాట్లాడుతూ... హైదరాబాద్ సీపీ , పోలీస్ శాఖ అల్లు అర్జున్ హౌస్ అరెస్ట్ విషయంలో సమాధానం చెప్పాలని అన్నారు. ప్రభుత్వం రేవంత్ చేతిలో ఉందని... బాధితులకు ఏం అనుకుంటే అది చేయొచ్చని అన్నారు. కానీ అసలు సమస్యను పక్కన పెట్టి రాజకీయం మొదలు పెట్టారని మండిపడ్డారు. అసెంబ్లీలో చర్చించే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేకపోతే .. అసెంబ్లీలో చర్చించే అంశాల గురించి తాము చెబుతామని అన్నారు. సచివాలయానికి 100 అడుగుల దూరంలో ఉన్న అంబేడ్కర్ జయంతి , వర్ధంతిలకు దండ వేసే తీరిక రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. దేశంలో అతి పెద్ద విగ్రహం ఉందని. ఈ విగ్రహం ఎవరైనా పెట్టొచ్చు కానీ దాని విషయంలో రేవంత్‌రెడ్డి తీరు సరిగా లేదని చెప్పారు. అంబేద్కర్ విషయంలో రేవంత్ అనుసరిస్తున్న తీరును కాంగ్రెస్ నేతలు ఎందుకు నిలదీయరని అన్నారు. వివేక్ , వీహెచ్ లాంటి నేతలు ఎందుకు ఈ విషయంపై మౌనంగా ఉంటున్నారని ఎంపీ రఘు నందన్ రావు ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
DK Aruna: అల్లు అర్జున్‌పై వేధింపులకు కారణం అదే.. డీకే అరుణ సంచలన కామెంట్స్
Allu Arjun: బన్నిని పోలీసులు అడుగుతున్న ప్రశ్నలు ఇవే.. సమాధానం చెప్పడంలో కన్ఫ్యూజన్ అయ్యారా..
TG highcourt: కేసీఆర్, హరీష్‌రావులకు హైకోర్టులో ఊరట
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 24 , 2024 | 03:06 PM