Share News

TG NEWS: రైతులను అవమానించిన మీరు నీతులు చెప్తారా.. బీఆర్‌ఎస్‌పై సీతక్క ఫైర్

ABN , Publish Date - Dec 21 , 2024 | 10:20 AM

రైతులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

TG NEWS: రైతులను అవమానించిన మీరు నీతులు చెప్తారా.. బీఆర్‌ఎస్‌పై సీతక్క ఫైర్

హైదరాబాద్: రైతులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా మంత్రి తుమ్మల రైతు భరోసాపై ఈ కీలక ప్రకటన చేశారు. రైతు భరోసాపై ప్రభుత్వం సబ్‌కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించామని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు రూ.80 వేల కోట్లు ఇచ్చిందని అన్నారు. గతంలో సాగుచేయని భూములకు కూడా రైతుబంధు ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తుచేశారు.


ఏడో రోజు తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఇవాళ(శనివారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌-2024 బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే సభ ముందుకు తెలంగాణ మున్సిపాలిటీల 2024 బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లు 2024ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ భూ భారతి బిల్లును మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రైతు భరోసాపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది.


రైతు భరోసాలో కోత పెడతామని చెప్పలేదు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Thummala.jpg

రైతు భరోసాలో కోత పెడతామని తాము ఇప్పటి వరకు చెప్పలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సభ్యుల అభిప్రాయం తర్వాతనే తమ నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. జీఓ 231 ప్రకారం పంట వేసిన వారికి రైతు బంధు ఇవ్వాలని ఉందని గుర్తుచేశారు. పంట వేయని వారికి రైతు బంధు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.దాని వల్ల రూ.20వేల కోట్లు పంట వేయని రైతుల చెబుల్లోకి వెళ్లిందని మాత్రమే సభ ముందు సమాచారం పెట్టామన్నారు. రూ.7620కోట్ల రైతు బంధు ఒకేసారి రైతుల ఖాతాలో వేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేశారు: మంత్రి సీతక్క

seethakka-tg-assembly.jpg

రాష్ట్రంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది అని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. సన్న వడ్లు వేస్తే ఉరి అన్నది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో రుణమాఫీ ఎందుకు కాలేదని నిలదీశారు. కేవలం వడ్డీ మాత్రమే మాఫీ అయిందన్నారు. మీరు అన్ని చేస్తే, రూ.30 వేల కోట్లు ఇంకా రైతులపై రుణం ఎందుకు ఉందని అడిగారు. ఫామ్ హౌస్‌లు ఉన్నవారికి కూడా రైతు భరోసా ఇవ్వాలా చెప్పాలని నిలదీశారు. రైతు భరోసాపై మీ వైఖరి ఏంటో చెప్పాలని మంత్రి సీతక్క అన్నారు.


అందుకే సభ ఆలస్యమైంది: అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

gaddam-prasad.jpg

మాజీ మంత్రి హరీష్‌రావును ఉద్దేశించి అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ మాట్లాడారు. సభ ఎప్పుడు పెద్దగా ఆలస్యం కాలేదని చెప్పారు. ఈరోజు జీరో వరకు తీసుకోవాలనే అంశం మీద చర్చ జరిగిందని అన్నారు. అందుకే సభ ప్రారంభానికి కొద్దిగా ఆలస్యమైందని చెప్పారు. అయితే హరీష్‌రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఏదో ఒక సాకుతో సభ సరిగా జగరడం లేదని చెప్పాలని బీఆర్ఎస్ భావిస్తోందని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇప్పటి వరకు సభకు రాకుండా సభ గౌరవాన్ని తగ్గించాలని చూస్తున్నారని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Revanth Reddy: తండ్రీకొడుకులు నేరగాళ్లు

MahaKumbh Mela: మహాకుంభ మేళాకు 14 ప్రత్యేక రైళ్లు

Neethu Bai: ఈ కిలాడీ లేడి.. మహా ముదురు.. టార్గెట్ ఫిక్స్ చేస్తే ...

Read Latest Telangana News and Telugu News

Updated Date - Dec 21 , 2024 | 01:30 PM