Telangana Formation Day: హైదరాబాదీలకు ముఖ్య గమనిక.. ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో...
ABN , Publish Date - Jun 01 , 2024 | 09:52 PM
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్2వ తేదీన రాష్ట్ర ద్విశాబ్ధి ముంగిపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్2వ తేదీన రాష్ట్ర ద్విశాబ్ధి ముంగిపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
వేడుకలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఐ అండ్ పీఆర్ కమిషనర్ హన్మంత్‌రావు మీడియాతో మాట్లాడారు. రేపు సాయంత్రం ట్యాంక్ బండ్‌పై పండుగ వాతావరణంతో ఉండనుందన్నారు. ఈరోజు(శనివారం) సాయంత్రం నుంచే షాపింగ్, గేమ్ షో లు ఉంటాయన్నారు. రేపు(ఆదివారం) ట్యాంక్ బండ్‌కు వచ్చే ప్రజలు సాయంత్రం 5గంటలలోపే చేరుకోవాలని అందరు ఆహ్వానితులేనని తెలిపారు. రేపు ఉదయం 9.30 గంటలకు గన్‌పార్క్ అమవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారని చెప్పారు.
9.55 గంటలకు పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారని.. 20 నిమిషాలు మార్చ్ ఫాస్ట్ ఉంటుందని తెలిపారు. 10.35 రాష్ట్ర గీతం ఆవిష్కరణ ఉంటుందని చెప్పారు..10 .43 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసగింస్తారని.. ఆ తర్వాత అవార్డుల అందజేస్తారని అన్నారు. మొత్తం కార్యక్రమం గంట 35 నిమిషాలు ఉంటుందన్నారు. సాయంత్రం 6.30గంటలకు సీఎం రేవంత్ ట్యాంక్ బండ్ చేరుకుంటారన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. జయ జయహే తెలంగాణ ఫుల్ సాంగ్‌తో ఫ్లాగ్ వాక్ ఉంటుందన్నారు. ట్యాంక్ బండ్‌పై అందెశ్రీ, కీరవాణికి సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మొత్తం 2 గంటల కార్యక్రమం ఉంటుందని ఐ అండ్ పీఆర్ కమిషనర్ హన్మంత్‌రావు పేర్కొన్నారు.