ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: వారానికి రెండుసార్లు గాంధీ భవన్‌కు మంత్రులు..

ABN, Publish Date - Sep 23 , 2024 | 05:14 PM

ఇకపై మంత్రులు ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ మూడు గంటలపాటు గాంధీ భవన్ వద్ద అందుబాటులో ఉండనున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

హైదరాబాద్: ప్రజా సమస్యలు తీర్చేందుకు, కాంగ్రెస్ శ్రేణులను కలిసేందుకు ఇకపై వారానికి రెండ్రోజులపాటు తెలంగాణ మంత్రులు గాంధీ భవన్‌(Gandhi Bhavan)కు రానున్నారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఒక్కో మంత్రి చొప్పున గాంధీ భవన్‌కు రానున్నారు. తెలంగాణ (Telangana) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు.. ప్రజలకు అందుబాటులో ఉండడం, తరచూ పార్టీ కార్యకర్తలు, నాయకులను కలవడం వల్ల పార్టీలో జోష్ పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర అధిష్ఠానం భావిస్తోంది. ఈ మేరకు నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు.


అయితే గాంధీ భవన్‌కు తొలి రోజు(ఈ బుధవారం) ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రానున్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ మూడు గంటలపాటు ఆయన ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. ఇకపై ప్రతి బుధ, శుక్రవారాల్లోనూ మంత్రులు ఇదే సమయంలో అందుబాటులో ఉండనున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. తరచూ పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవడం వల్ల గ్రామస్థాయి వరకూ పరిస్థితి ఎలా ఉందనే అంశాలు తెలుస్తాయని భావిస్తున్నారు.


అలాగే సంక్షేమ పథకాలు సైతం గ్రామస్థాయికి చేరుతున్నాయా, లేదా.. ఒకవేళ చేరితే ప్రజల స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దీనిపై పీసీసీ చీఫ్‍గా బాధ్యతలు చేపట్టిన రోజే గాంధీ భవన్‌కు రావాలని మహేశ్ కుమార్ గౌడ్ మంత్రులను కోరినట్లు తెలుస్తోంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సైతం నెలకు కనీసం రెండుసార్లు పార్టీ శ్రేణులను నేరుగా కలిసేందుకు గాంధీ భవన్‌కు రావాలని మహేశ్ గౌడ్ కోరారు. దీనిపై సీఎం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం.

ఈ వార్తలు కూడా చదవండి:

Mahesh Babu: వరద బాధితులకు సూపర్ స్టార్ మహేశ్ విరాళం.. సీఎంను కలిసి..

Gongidi Suntiha: మంత్రి కోమటిరెడ్డికి విలువలు లేవు‌... గొంగడి సునీత విసుర్లు

Bathukamma Fest: పూలనే దేవుళ్లుగా కొలిచే ఆడబిడ్డల పండుగ.. బతుకమ్మ విశేషాలు తెలుసా

Harish: బీహార్‌‌లా తెలంగాణను మారుస్తున్నారు.. హరీష్ ఆగ్రహం

Updated Date - Sep 23 , 2024 | 05:23 PM