Share News

Tension.. Tension.. సికింద్రాబాద్ మోండ మార్కెట్ వద్ద టెన్షన్.. టెన్షన్..

ABN , Publish Date - Oct 14 , 2024 | 11:56 AM

సికింద్రాబాద్ మోండ మార్కెట్ ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. బీజేపీ కార్పొరేటర్లు, వీహెచ్‌పీ, భజరంగదళ్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాయి.

Tension.. Tension.. సికింద్రాబాద్ మోండ మార్కెట్ వద్ద టెన్షన్.. టెన్షన్..

హైదరాబాద్: సికింద్రాబాద్ (Secunderabad) కూర్మగూడలో టెన్షన్ (Tension ) నెలకొంది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు అమ్మవారి (Ammavari) ఆలయంలోకి ప్రవేశించి విగ్రహం (Statue) ధ్వంసం చేశారు. విషయం పసిగట్టిన స్థానికులు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశారు.. నిందితుల్లో ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఎలాంటి గొడవలు జరగకుండా కట్టుదిట్టం చేశారు. పట్టుబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


సికింద్రాబాద్ మోండ మార్కెట్ ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. బీజేపీ కార్పొరేటర్లు, వీహెచ్‌పీ, భజరంగదళ్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాయి. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

మాజీ మంత్రి తలసాని మాట్లాడుతూ.. మత విద్వేషాలను ప్రేరేపించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. నిన్నటి వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామాత నవరాత్రులు, బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారని.. విగ్రహం ధ్వసం చేయడం ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. దోషులు ఎంతటివారైనా పోలీసులు కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యే రఘురామా కేసులో ట్విస్ట్..

సాహితి ఇన్ ఫ్రా ఎండీని ప్రశ్నించనున్న ఈడీ

ఏపీలో ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు..

గీసుగొండ వివాదంపై మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే..

తుపాను ప్రభావంతో భారీ వర్షాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 14 , 2024 | 11:56 AM