Veerlapally Shankar: ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాల్జేశారు
ABN, Publish Date - Jul 07 , 2024 | 03:48 PM
ధనిక రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల పాల్జేశారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapally Shankar) ఆరోపించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అనవసరంగా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
షాద్ నగర్: ధనిక రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల పాల్జేశారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapally Shankar) ఆరోపించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అనవసరంగా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. ఏపీ మాజీ మంత్రి రోజా పెట్టిన రాగి సంకటి , నాటు కోడి పులుసు కేసీఆర్ తిన్నప్పుడు నిరంజన్ రెడ్డి ఎక్కడ పోయారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ కాపాడుతుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా రాలేదని చెప్పారు.
బీజేపీకి ఓట్లు వేయించమన్నది కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులని అన్నారు. అందుకే తమకు భవిష్యత్ లేదని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు. అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కార్యకర్తలే ఈ రోజు ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి పంపుతున్నారని అన్నారు. ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకున్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ని కేసీఆర్ ఆలింగనం చేసుకోలేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ కే సాధ్యమని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు.
Updated Date - Jul 07 , 2024 | 03:49 PM