Share News

Ramoji Rao: రామోజీ రావు గురించి ఆసక్తికర విషయాలు

ABN , Publish Date - Jun 08 , 2024 | 08:07 AM

రామోజీ రావు(Ramoji Rao) మీడియా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశపు 'రూపర్ట్ మర్డోక్'గా పేరుగాంచిన చెరుకూరి రామోజీరావు(87) వ్యాపారవేత్తగా, మీడియా బారన్‌గా ప్రసిద్ధి చెందారు. అయితే తాజాగా రామోజీ మృతి చెందిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Ramoji Rao: రామోజీ రావు గురించి ఆసక్తికర విషయాలు
Interesting facts about Ramoji Rao

రామోజీ రావు(Ramoji Rao) మీడియా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశపు 'రూపర్ట్ మర్డోక్'గా పేరుగాంచిన చెరుకూరి రామోజీరావు(87) వ్యాపారవేత్తగా, మీడియా బారన్‌గా ప్రసిద్ధి చెందారు. అయితే తాజాగా రామోజీ మృతి చెందిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1936 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీ అంచెంలంచెలుగా ఎదిగారు. తన చదువు పూర్తయ్యాక పూర్తిగా రైతులపై ఆధారపడిన పత్రికను ప్రచురించాలని రామోజీ నిర్ణయించుకుని విశాఖపట్నం నుంచి ఈ పత్రిక ప్రచురణను ప్రారంభించారు. వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు అందించేది. అప్పట్లో ఈ పత్రిక బాగా ప్రాచుర్యం పొందింది.


పత్రిక నుంచి మొదలై..

ఆ తర్వాత పత్రిక నుంచి వచ్చిన విపరీతమైన ఆదరణ తర్వాత రామోజీ సినిమా నిర్మాణం వైపు మళ్లారు. 1983లో ఉషాకిరణ్‌మూవీస్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ని స్థాపించారు. దీని ఆధ్వర్యంలో అనేక తెలుగు చిత్రాలను నిర్మించారు. ఈ బ్యానర్‌లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ సహా 80కి పైగా విభిన్న భాషల్లో సినిమాలు నిర్మించారు.

రామోజీ ఫిల్మ్ సిటీ

రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్‌గా పరిగణించబడుతుంది. ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టూడియో 2000 ఎకరాల కంటే ఎక్కువ (8.2 చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ స్టూడియోలో 50 షూటింగ్ అంతస్తులు ఉన్నాయి. ఈ స్టూడియో 1996లో ప్రారంభమైంది. ఇక్కడ ఏకకాలంలో 15 నుంచి 25 చిత్రాలను చిత్రీకరించవచ్చు. సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. సినిమాలే కాకుండా, ఇది గొప్ప పర్యాటక ప్రదేశం. ప్రతి ఏటా దేశం, ప్రపంచం నలుమూలల నుంచి 10 లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తారు.


ప్రాంతీయ ఛానెళ్ల రారాజు

భారతదేశంలో ప్రాంతీయ ఛానెల్‌లను ప్రారంభించిన మొదటి వ్యక్తి రామోజీ. నేడు దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రంలో వార్తలను ప్రసారం చేస్తున్నారు. ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్ మొబైల్ అప్లికేషన్ సహా తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ఈటీవీ మంచి నెట్‌వర్క్‌ను కల్గి ఉంది. దీంతోపాటు జర్నలిజం స్కూల్ కేంద్రాన్ని నిర్వహిస్తూ ప్రత్యేక స్థానాన్ని రామోజీ సంపాదించుకున్నారు.

అవార్డులు

మీడియా, జర్నలిజం ప్రపంచానికి ఆయన చేసిన విశేష కృషికి గాను 2016లో ఆయనకు భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మవిభూషణ్‌తో సత్కరించారు. దీనికి ముందు 1985లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం (తెలుగు), 1998లో ఫిల్మ్‌ఫేర్ ప్రత్యేక అవార్డు, 2000లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం (తెలుగు), జాతీయ చలనచిత్ర పురస్కారం (నిర్మాత), 2004లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు లభించాయి.


ఆపన్న హస్తం

కరోనా మహమ్మారి సమయంలో 2020లో కష్ట సమయంలో రామోజీ రావు కోవిడ్ రిలీఫ్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్‌కు రూ. 10 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంతే కాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల పునరావాసం అనేక పనులు చేయించారు. దీంతోపాటు అనేక పనుల కోసం విరాళాలు అందించారు.

సింపుల్ వ్యక్తిత్వం

రామోజీ చాలా వరకు తెల్లటి హాఫ్ స్లీవ్ షర్ట్, తెల్లటి ప్యాంటు, తెల్లటి షూ వేసుకుంటారు. ఏదైనా పార్టీలు మినహా దాదాపు ఎక్కువగా వీటినే ధరిస్తారు. దాదాపు 12 టీవీ ఛానల్స్, తెలుగు దినపత్రిక యజమాని అయిన రామోజీ రావు మొదటి చూపులో చాలా మామూలుగా కనిపిస్తారు.


ఇవి కూడా చదవండి:

Ramoji Rao: అక్షర శిల్పి రామోజీకి ఘన నివాళి


Narendra Modi: రేపు ఈ సమయంలోనే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. భారీగా భద్రతా ఏర్పాట్లు


Kangana Ranaut: కంగానాకు చెంప దెబ్బ.. కానిస్టేబుల్‌కి మద్దతుగా రైతు సంఘాలు ఏం చేస్తున్నాయంటే?

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 08 , 2024 | 10:20 AM