Bandi Sanjay: మాజీ సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 14 , 2024 | 12:21 PM
కరీంనగర్: భారతీయ జనతా పార్టీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా చేస్తారని, కేసీఆర్ కుట్రల వల్ల ఏమైనా జరగొచ్చునని అన్నారు.
కరీంనగర్: భారతీయ జనతా పార్టీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా చేస్తారని అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుట్రల వల్ల ఏమైనా జరగొచ్చునని అన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఆ నింద బీజేపీ మీద నెట్టివేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ ముందు బీఆర్ఎస్‌ను బొంద పెట్టాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే జనం నమ్మరని, కాంగ్రెస్ పార్టీ గుడ్డి ఆలోచనలోనే ఉందన్నారు.
ముందు కేసీఆర్ సంగతి చూడాలని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ గట్టిగా కొట్లాడితే ఇంకోడు బయటపడే అవకాశం ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మొండి పట్టుకు పోవద్దని, బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రానికి నిధులు వస్తాయని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన తమకు లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.