ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: కేటీఆర్ విమర్శలు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్..!

ABN, Publish Date - Mar 10 , 2024 | 07:41 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్‌కు కండకావరమెక్కి తన గురించి మాట్లాడుతున్నాడంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. కరీంనగర్‌లో(Karimnagar) మీడియాతో మాట్లాడిన ఆయన..

MP Bandi Sanjay Kumar

కరీంనగర్, మార్చి 10: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్‌కు కండకావరమెక్కి తన గురించి మాట్లాడుతున్నాడంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. కరీంనగర్‌లో(Karimnagar) మీడియాతో మాట్లాడిన ఆయన.. కేటీఆర్‌ తనపై చేసిన కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎంపీగా బండి సంజయ్ చేసిందేమీ లేదంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్‌కు తీవ్రంగా స్పందించిన ఆయన.. పార్లమెంట్ రికార్డులు చూసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు. తానేం చేశానో పార్లమెంట్ రికార్డులు చెబుతాయన్నారు బండి సంజయ్.

పార్లమెంట్‌కు వెళ్లకుండా తాగి పడుకున్న చరిత్ర కేసీఆర్‌ది అంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చీపురుతో బీఆర్ఎస్‌ను ఊడ్చేసినా సిగ్గురాదేంటూ వ్యాఖ్యానించారు. ఏం సాధించారని కరీంనగర్ కదనభేరి నిర్వహిస్తున్నారంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు బండి సంజయ్ కుమార్. కరీంనగర్ సభ సాక్షిగా కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారాయన. తాను బరాబర్ హిందుత్వం గురించి మాట్లాడుతానని, దమ్ముంటే మీరు బాబర్, ఔరంగజేబు గురించి మాట్లాడాలని బీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ సవాల్ విసిరారు.

బీజేపీకి ఓటెయ్యండి..

రాష్ట్రంలో ప్రజల కోసం బీజేపీ పోరాడితే.. ప్రజలు మాత్రం కాంగ్రెస్‌కు ఓటు వేశారని, ఇది ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు బండి సంజయ్ కుమార్. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారాయన. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ చెప్పిన 100 రోజులు పూర్తవుతుందన్నారు. 6 గ్యారంటీలను నాలుగు రోజుల్లో అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కేబినెట్‌లో వాటికి ఆమోదం తెలిపి నిధులు విడుదల చేయాల్సిందేనని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 10 , 2024 | 07:41 PM

Advertising
Advertising