Ponnam Prabhakar: వాహన కొనుగోలు దారులకు గుడ్ న్యూస్
ABN , Publish Date - Nov 17 , 2024 | 05:57 PM
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులోభాగంగా రాష్ట్రంలో రవాణా శాఖ పరంగా మార్పులు, చేర్పులు తీసుకొచ్చి... ప్రజల్లో చైతన్య కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దేశ రాజధాని ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ మహానగరంలో కాలుష్య రహితంగా ఉంచేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దీని ద్వారా వాహనదారులకు ఏడాదికి సుమారు రూ. లక్ష మిగులుతుందన్నారు. తెలంగాణలో రేపటి నుంచి కొత్త ఈవీ పాలసీ వస్తుందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా చేయడం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన వివరాలను ఈ సందర్బంగా ఆయన వివరించారు.
Also Read: ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అందులోభాగంగా రాష్ట్రంలో రవాణా శాఖ పరంగా మార్పులు, చేర్పులు తీసుకొచ్చి... ప్రజల్లో చైతన్య కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దేశ రాజధాని ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ మహానగరంలో కాలుష్య రహితంగా ఉంచేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చామని ఆయన స్పష్టం చేశారు.
Also Read: ఎన్నికల ప్రచారంలో నవనీత్ కౌర్‌పై దాడి
గతంలో 2020 - 2030 ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) పాలసీ తీసుకొచ్చారని చెప్పారు. జీవో నెంబర్ 41 ద్వారా 2026 డిసెంబర్ 31 వరకు ఇది అమలులో ఉంటుందని ఆయన గుర్తు చేశారు. అయితే సోమవారం నుంచి ఈ జీవో ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమలులోకి వస్తుందన్నారు. ఇక రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి అనేది లేదని తెలిపారు. ఇక కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మార్చాలని ప్రణాళికలు సైతం తీసుకు వచ్చామన్నారు.
Also Read: చిన్ని ఉసిరి వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
హైదరాబాద్‌లో కాలుష్య తీవ్రత 83 ఉంటే.. పఠాన్‌చెరువులో 72 ఉందన్నారు. ఆ క్రమంలో కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవీపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని చెప్పారు. హైదరాబాద్‌లో ఇప్పుడున్న మూడు వేల బస్సులు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. త్వరలో నగరంలో మొత్తం ఆర్టీసీ బస్సులు నడుస్తాయని చెప్పారు.
అయితే మరికొంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు పరిమితి సంఖ్య లోనే ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తున్నారన్నారు. ఈవీ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్జప్తి చేశారు. వాహనదారులు పొల్యూషన్ టెస్ట్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
దేశంలో లక్ష 50 వేల మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క తెలంగాణలో రోజుకు 20 మంది చనిపోతున్నారని చెప్పారు. రోడ్ సేఫ్టీపై గురువా రెడ్డి సంస్థ లైసెన్స్ ఇచ్చే ముందే అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుందన్నారు. అలాగే యునిసెఫ్ ద్వారా స్కూళ్లలో రోడ్డు అవేర్‌నెస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
కొత్తగా నియమితులైన వారిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పెడుతున్నామన్నారు. రవాణా శాఖకు కొత్త లోగోతోపాటు కొత్త వాహనాలు సైతం వస్తున్నాయన్నారు. రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు అనుగుణంగా చార్జింగ్ స్టేషన్స్ ఉంటున్నాయన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు చొరవ తీసుకొని చార్జీంగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈవీ వాహనాలకు గతంలో 5 వేల వాహనాలకు టాక్స్ మినహాయింపు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు లక్షా 70 వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయన్నారు. ప్రస్తుతం రోజుకు ప్రతి వంద వాహనాలలో 5 ఎలక్ట్రిక్ వాహనాల ఉంటున్నాయన్నారు.
వచ్చే 10 రోజుల్లో రవాణా శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ పోలీస్‌లతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. రవాణా శాఖ ప్రమోషన్లకు వ్యతిరేకం కాదన్నారు. ప్రమోషన్ల ప్రాసెస్ నడుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
For Telangana News And Telugu News