Lok Sabha Polls 2024: మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యకు కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్
ABN , Publish Date - Apr 14 , 2024 | 09:10 PM
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మాజీ మంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య కలిశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను రాజయ్యకు కేసీఆర్ అప్పగించారు.
ఎర్రవెల్లి: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మాజీ మంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య కలిశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను రాజయ్యకు కేసీఆర్ అప్పగించారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్‌ను గెలిపించుకోవాలని రాజయ్యకు కేసీఆర్ సూచించారు. వ్యూహాత్మకంగా పనిచేయాలని కోరారు.
కాగా స్టేషన్ ఘన్‌పూర్ నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కూతురితో సహా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం రాజయ్య ముఖ్య నేతగా ఉన్నారు. గతేడాది డిసెంబర్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ కేటాయించలేదు. కడియం శ్రీహరికి కేటాయిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడం.. ఆయన గెలుపొందడం తెలిసిన విషయాలే.