ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పాలన చివరి దాకా ఉండేలా లేదు.. మధ్యలోనే ఎన్నికలు: కేసీఆర్

ABN, Publish Date - May 05 , 2024 | 05:05 PM

తెలంగాణలో కాంగ్రెస్ (Congress) పాలన చివరి దాకా ఉండేలా లేదని... మధ్యలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

BRS Chief KCR

కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ (Congress) పాలన చివరి దాకా ఉండేలా లేదని... మధ్యలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ మన సర్కారే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నీళ్లిచ్చినం, కరెంట్ ఇచ్చినం, రైతు బంధు ఇచ్చినం, పంట కొన్నామని తెలిపారు. తెలంగాణలో హుజురాబాద్ దళితులు ఆత్మ గౌరవంతో ఉన్నారని ఉద్ఘాటించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మాయ మాటలు నమ్మారని అన్నారు.


KTR: యాచన వద్దు.. శాసిద్దాం

రాజకీయాల్లో గెలుపు, ఓటములు సమస్య కాదని అన్నారు. పంట వేసేటప్పుడు రైతు బంధు ఇస్తారా.. పంట కోసేటప్పుడు ఇస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రూ. వెయ్యి కోట్ల కంపెనీ మద్రాస్ పోయిందని మండిపడ్డారు. నాలుగైదు నెలల్లోనే రేవంత్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వచ్చిందని అన్నారు. తమ హయాంలో పోని కరెంట్.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎందుకు ఉండట్లేదో ఆలోచించాలని చెప్పారు. గోదావరి నీళ్లు పోతే... తెలంగాణకు బతుకే లేదని కేసీఆర్ అన్నారు.


Hyderabad: అసదుద్దీన్‌ ప్రచారం తీరు మారిందా? గత ఎన్నికలకు భిన్నంగా ప్రచార శైలి

ప్రధాని మోదీ నీళ్లను పక్క రాష్ట్రాలకు తీసుకెళ్తానంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించట్లేదని అన్నారు. కరీంనగర్‌ను బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఆయన ఎంపీ అయ్యాక జిల్లాకు ఏం ఓరగలేదని విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.

Harish Rao: మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలాగేనా మాట్లాడేది

Read Latest Election News or Telugu News

Updated Date - May 05 , 2024 | 05:10 PM

Advertising
Advertising