ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KCR: ప్రలోభాలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

ABN, Publish Date - Apr 13 , 2024 | 07:23 PM

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కాంగ్రెస్‌ ప్రభుత్వం కుదేలు అయ్యిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. శనివారం నాడు చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ (BRS) ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను ఎంతగానో అభివృద్ధి చేశామని తెలిపారు.

చేవెళ్ల: అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కాంగ్రెస్‌ ప్రభుత్వం కుదేలు అయ్యిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. శనివారం నాడు చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ జరిగింది. ఈ సభలో కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ (BRS) ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను తాము ఎంతగానో అభివృద్ధి చేశామని తెలిపారు. కాంగ్రెస్‌ ఎన్నికల హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు.


Kishan Reddy: బీఆర్‌ఎస్‏కు ఓటేస్తే.. మూసీ నదిలో వేసినట్టే...

ఎన్నో పోరాటాలు, ఆమరణ దీక్ష చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించానని తెలిపారు. పదేళ్లు రాష్ట్రాన్ని కాపాడానని అన్నారు. అంబేడ్కర్‌ ముందుచూపుతోనే మనకు తెలంగాణ సాకారమైందన్నారు. ఆర్డికల్‌ 3 వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని అన్నారు. తమను ప్రభుత్వం ఆదుకుంటుందనే విశ్వాసం ప్రజల్లో ఉండాలన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఆ నమ్మకం లేదని చెప్పారు. ప్రలోభాలతోనే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు.


Danam Nagender: కాంగ్రెస్ అభ్యర్థి ‘దానం’ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

అంబేడ్కర్‌ విగ్రహం దగ్గర ధర్నా చేస్తా..

1.30 లక్షల మందికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు మంజూరు చేస్తే.. మంజూరైన డబ్బులను కూడా ఈ ప్రభుత్వం ఆపేసిందని మండిపడ్డారు. దళితబంధు ఇవ్వకుంటే అంబేడ్కర్‌ విగ్రహం దగ్గర ధర్నా చేస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.10 లక్షలు కాదు.. రూ.12 లక్షలు ఇస్తామన్నారు ఏమైంది? అని ప్రశ్నించారు. తాము ఇచ్చిన 24 గంటల విద్యుత్‌ ఇప్పుడు ఎక్కడ? అని నిలదీశారు. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌, సాగునీరు, తాగునీళ్లు లేవన్నారు. విదేశీ విద్య స్కాలర్‌షిప్‌ నిలిపివేశారని కేసీఆర్ విరుచుకుపడ్డారు.


Venkatram Reddy: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఉన్నట్టు కథలు అల్లారు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ


అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ సాధించామన్నారు. రేపు అంబేద్కర్ జయంతి నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 125అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు ధీమా, దైర్యం ఉండాలన్నారు. ప్రభుత్వానికి ఇచ్చిన హామీలపై సరైన కార్యాచరణ లేదన్నారు. దళిత బంధు ఇవ్వట్లేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో లక్ష 30వేల మందికి దళిత బంధు ప్రొసీడింగ్స్ ఇచ్చామని తెలిపారు.


దళిత బంధు డబ్బులు ఇవ్వట్లేదు...

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ డబ్బులను దళితులకు ఇవ్వకుండా ఫ్రీజ్ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పక్కకు వెళ్లగానే కరెంట్ ఎందుకు మాయమైందని ప్రశ్నించారు. కరెంట్ ఇవ్వలేక పోవడం ప్రభుత్వ అసమర్థత కాదా? అని నిలదీశారు. ఎవరి తెలివి తక్కువ తనంతో మంచి నీళ్ల కొరత వచ్చిందని ప్రశ్నించారు. తాము ఓడిపోగానే ప్రజలకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయన్నారు. ప్రభుత్వ మెడలు వంచి హామీలు అమలు చేసేలా పోరాటం చేస్తామన్నారు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజల పనులు త్వరగా జరుగుతాయని తెలిపారు.


రంజిత్‌రెడ్డికి బుద్ధి చెప్పాలి

రైతులు గోస పడుతుంటే తనకు బాధేస్తోందన్నారు. బీఆర్ఎస్ పుణ్యానా గెలిచిన వ్యక్తి ఎంపీ రంజిత్ రెడ్డి అని గుర్తుచేశారు. ఆయనకు ఏం తక్కువ చేశాం... ఎందుకు పార్టీ మారారని ప్రశ్నించారు. ఇలాంటి నేతలకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని హెచ్చరించారు. ఈ ప్రభుత్వంలో అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వట్లేదు కానీ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ మత పిచ్చి లేపడం తప్పా ఏ వర్గానికైనా ఒక మంచి పని చేసిందా అని కేసీఆర్ నిలదీశారు.


బీజేపీ బెదిరించింది..

బీజేపీలో చేరుతావా లేదా జైలుకు వెళ్తావా అన్నది ఆ పార్టీ విధానమని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మెడ మీద కత్తి పెట్టి మోటార్లకు మీటర్లు పెడతావా లేదా అని బెదిరించారని చెప్పారు. అయినా తాను రైతుల శ్రేయస్సు కోసం మీటర్లు పెట్టలేదని తెలిపారు. మోటార్లకు మీటర్లు రావద్దంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయొద్దని అన్నారు. మనల్ని నూకలు తినాలన్న బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో నూకలు బుక్కించాలని కేసీఆర్ హెచ్చరించారు. బీసీలకు దమ్ముంటే కాసాని జ్ఞానేశ్వర్‌ని ఎంపీగా గెలిపించి చూపించాలని ఓ నేత తనకు సవాల్ విసిరారన్నారు. బీసీలంతా ఏకమై కాసానిని గెలిపించి పౌరుషం చూపించాలని కేసీఆర్ కోరారు.


TG Politics: అందుకే ఫోన్ ట్యాపింగ్.. సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 13 , 2024 | 08:27 PM

Advertising
Advertising