TG Politics: ఆ ఎమ్మెల్యేలు గాంధీభవన్ చుట్టూ తిరుగుతున్నారు: కిషన్‌రెడ్డి
ABN, Publish Date - May 23 , 2024 | 09:15 PM
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో రెండోస్థానం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు.
ఖమ్మం జిల్లా: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో రెండోస్థానం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌కు ఓట్లు అడిగే హక్కు కూడా లేదన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయని చెప్పారు. బీజేపీ అభ్యర్థిగా చాలా సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా పని చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారని తెలిపారు. ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ గురువారం ఖమ్మంలో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ తమిళనాడు సహా ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు, పార్టీ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, టీడీపీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు వాసిరెడ్డి రామనాధం పాల్గొన్నారు.గత ఎన్నికల్లో కూడా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం, కాంగ్రెస్‌లో గెలిచిన నేతలు బీఆర్ఎస్‌లో చేరుతూ.. కాలం వెళ్లదీస్తున్నారని సెటైర్లు గుప్పించారు.
మాజీ సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలని ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారని.. ఆ పార్టీకు అవకాశం ఇస్తే పెనం మీద నుంచి పొయ్యి లో పడ్డట్లు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఉందన్నారు. చివరి ధాన్యం గింజ వరకు కూడా కేంద్రం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.
ధాన్యం కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ ఏముంది, రైతులకు ఇస్తానన్న బోనస్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బోనస్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులతో కాలయాపన చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక కావాలి, అది బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున పోరాడే బీజేపీ వెంట ప్రజలు ఉండాలని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీనీ గద్దె దించడమే బీజేపీ లక్ష్యమని, ఆ పార్టీ 5 సంవత్సరాలు కూడా అధికారంలో ఉండటం గగనమేనని చెప్పారు. ప్రేమేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కిషన్‌రెడ్డి కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ నేత డీజే శివపై వైసీపీ మూకల దాడి..
నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్..
టార్గెట్ ఎమ్మెల్సీ.. ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ..
ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు..
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..
నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 23 , 2024 | 10:05 PM