ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: జమ్మూ కశ్మీర్‌ అభివృద్ధి కాంగ్రె్‌సకు కనిపించట్లేదా?: కిషన్‌ రెడ్డి

ABN, Publish Date - Aug 06 , 2024 | 03:26 AM

గత ఐదేళ్లలో బీజేపీ పాలనలో జరిగిన జమ్మూ కశ్మీర్‌ అభివృద్ధి కాంగ్రెస్‌ కనిపించడం లేదా అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, జమ్మూ కశ్మీర్‌ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో బీజేపీ పాలనలో జరిగిన జమ్మూ కశ్మీర్‌ అభివృద్ధి కాంగ్రెస్‌ కనిపించడం లేదా అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, జమ్మూ కశ్మీర్‌ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి అడ్డుగా ఉండి, అక్కడి ప్రజల స్వేచ్ఛకు సంకెళ్లుగా మారిన ఆర్టికల్‌ 370 రద్దు చేయడాన్ని కాంగ్రెస్‌ ‘బ్లాక్‌ డే’గా పరిగణించడంపై మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు కశ్మీర్‌లో అశాంతికి, అభివృద్ధి జరగకపోవడానికి కాంగ్రెస్సే కారణమన్నారు.


వెనుకబాటు, కుటుంబ రాజకీయాల నుంచి జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్రత కల్పించినందుకు ‘బ్లాక్‌ డే’ నిర్వహిస్తున్నారా అంటూ కాంగ్రె్‌సను నిలదీశారు. కాగా, ఎన్నికల హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం రెండు దఫాలుగా రుణమాఫీ అమలు చేసినట్లు ప్రకటించినా, ఇప్పటికీ వేలాది మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తాము ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రానికి పెద్ద సంఖ్యలో రైతులు ఫోన్లు చేసి రుణమాఫీ అమలు కాలేదని వాపోతున్నారని వివరించారు.

Updated Date - Aug 06 , 2024 | 03:27 AM

Advertising
Advertising
<