ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kishan Reddy: మైన్స్ శాఖ కేటాయించడంపై కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, Publish Date - Jun 10 , 2024 | 09:40 PM

మోదీ 3.0 కేబినేట్‌లోతెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ, కిషన్‌రెడ్డికి (Kishan Reddy) కేంద్రమంత్రి అవకాశం కల్పించారు. నిన్న(ఆదివారం) రాష్ట్రపతి భవన్‌లో కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

Kishan Reddy

ఢిల్లీ: మోదీ 3.0 కేబినేట్‌లోతెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ, కిషన్‌రెడ్డికి (Kishan Reddy) కేంద్రమంత్రి అవకాశం కల్పించారు. నిన్న(ఆదివారం) రాష్ట్రపతి భవన్‌లో కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు(సోమవారం) ఆయనకు కేంద్ర బొగ్గు గనుల శాఖను కేటాయించారు. ఈ శాఖను కేటాయించడంపై కిషన్‌‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


కొల్ ప్రొడక్షన్, పవర్ గ్రిడ్ పెంచారు..

‘‘ప్రముఖమైన శాఖలకు పాత మంత్రులు కొనసాగుతున్నారు. ఏపీ నుంచి కేబినెట్ మంత్రిగా రామ్మోహన్ నాయుడుకు పౌరవిమానయాన శాఖను కేటాయించారు.కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి హోంశాఖ సహాయమంత్రి శాఖ కేటాయించారు.చంద్రశేఖర్ పెమ్మసాని గ్రామీణ అభివృద్ధి,కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ కేటాయించారు. నాకు బొగ్గు గనుల శాఖ కేటాయించారు. ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు చేపడుతాను. 100 రోజుల్లో అజెండా ఏంటో అధికారుల దగ్గర వివరాలు తెల్సుకుని కార్యాచరణ రూపొందిస్తాం. బొగ్గు గనుల, కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తా. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాపై విశ్వాసంతో రెండు శాఖలు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో మైన్స్ శాఖలు ఉన్నాయి. దేశానికి రెవెన్యూ తీసుకొచ్చే రెండు శాఖలు ఇవి. ప్రహ్లాద్ జోషి గతంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా చక్కగా పని చేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొల్ ప్రొడక్షన్ పెంచారు. అన్ని రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్ పెంచారు. రానున్న రోజుల్లో బొగ్గు కొరత లేకుండా పెంచే విధంగా చర్యలు చేపడుతాను’’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


కాంగ్రెస్ ప్రభుత్వంలో బొగ్గు కుంభకోణాలు...

‘‘విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు సరఫరా చేస్తాను. బొగ్గు గనులు వేలం వేయడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బొగ్గు కుంభకోణాలు జరిగాయి. వేలాది పరిశ్రమలకు బొగ్గు సరఫరా చేయాలి. దేశ అభివృద్ధికి బొగ్గు చాలా అవసరం. విద్యుత్ సరఫరా ఉన్న అదే స్థాయిల్లో బొగ్గు అవసరం. బొగ్గు గనులు ఎప్పటి వరకు ఉన్నాయి , ఎన్నేళ్లు నిల్వ ఉన్నాయో అధ్యాయం చేస్తాను. మోదీ మార్గదర్శకంలో ముందుకు వెళ్తాను. ఒక తెలుగు వాడిగా దేశానికి మంచి పేరు తీసుకొస్తాను. తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో నలుగురు మంత్రులకు మంచి శాఖలు ఇచ్చారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం పని చేస్తాను. 12 వ తేదీన ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకరం చేస్తున్నారు.ఈ ప్రమాణ స్వీకారానికి వెళ్తాను. రామ్మోహన్ నాయుడుకు పౌరవిమానయాన శాఖ ఇవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్ పోర్ట్‌లా ఏర్పాటుకు కృషి చేస్తారు. వరంగల్లో ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం కృషి చేస్తాం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 09:50 PM

Advertising
Advertising