ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nalgonda: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై 17 బ్లాక్‌స్పాట్లకు మోక్షం!

ABN, Publish Date - Jun 24 , 2024 | 03:20 AM

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-163)పై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించిన 17 బ్లాక్‌స్పాట్‌ల బెడద త్వరలో తొలగిపోనుంది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చేపట్టే పనులతో పాటు నల్లగొండ జిల్లా చిట్యాలలో హైవేపై నిర్మించే ప్లై ఓవర్‌ నిర్మాణానికి రోడ్లు,

  • రూ.30 వేల కోట్లతో త్వరలో ట్రిపుల్‌ ఆర్‌ పనులు

  • ఎక్స్‌ప్రెస్‌ హైవే కోసం కేంద్రానికి ప్రతిపాదనలు

  • ప్రమాదాల నివారణకు 10 చోట్ల అండర్‌పా్‌సలు

  • మిగతాచోట్ల సర్వీస్‌ రోడ్ల నిర్మాణం వంటి చర్యలు

  • పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌/చిట్యాల, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-163)పై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించిన 17 బ్లాక్‌స్పాట్‌ల బెడద త్వరలో తొలగిపోనుంది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చేపట్టే పనులతో పాటు నల్లగొండ జిల్లా చిట్యాలలో హైవేపై నిర్మించే ప్లై ఓవర్‌ నిర్మాణానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. 17 బ్లాక్‌స్పాట్‌ల పనులకు రూ.288 కోట్లు, మరో రెండుచోట్ల బ్రిడ్జిలకు రూ.73 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా ఈ హైవేపై ప్రమాదాల నివారణకు రూ.361 కోట్లతో పనులు చేపడుతున్నారు. గతంలో సర్వే చేసిన జాతీయ రహదారుల సంస్థ.. ఈ హైవేలో 17 చోట్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించింది.


మూడేళ్ల(2015-2018)లో 548 ప్రమాదాలు జరిగాయని, 264 మరణాలు సంభవించాయని సర్వేలో తేలింది. దీంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. గతంలో టెండర్లను ఆహ్వానించినా పలు కారణాలతో ఈ పనులు మొదలుకాలేదు. కోమటిరెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్నప్పటి నుంచే ఈ హైవేపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. ఆయన కృషి ఫలించి పనులకు ఇప్పుడు శంకుస్థాపన జరిగింది. ఈ పనులను 18 నెలల్లో పూర్తిచేసేలా జాతీయ రహదారుల సంస్థ.. కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదర్చుకుంది.


ఎన్‌హెచ్‌-163పై చౌటుప్పల్‌ నుంచి నవాబ్‌పేట జంక్షన్‌ వరకు ప్రమాదాలు జరిగే 17 ప్రాంతాల్లో 10 చోట్ల వెహికల్‌ అండర్‌పా్‌సల నిర్మాణం, రోడ్ల వెడల్పు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. కాగా, చౌటుప్పల్‌, పెద్దకాపర్తి, చిట్యాల టేకుమట్ల, జనగామ క్రాస్‌, ఎస్వీ కాలేజ్‌, సూర్యాపేట ఫ్లై ఓవర్‌ ముగిసే చోట, ముకుందాపురం కొమరబండ క్రాస్‌రోడ్‌, రామాపురం క్రాస్‌ రోడ్‌ వద్ద అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు.


రూ.30 వేల కోట్లతో ట్రిపుల్‌ ఆర్‌

హైదరాబాద్‌ చుట్టూ రూ.30 వేల కోట్లతో త్వరలో రీజనల్‌ రింగ్‌ రోడ్డు పనులను చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌-విజయవాడ రహదారిని ఎక్స్‌ప్రెస్‌ హైవేగా మార్చడానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఆదివారం ఆయన చిట్యాలలో ఫ్లై ఓవర్‌కు శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిందని, రూ.7లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు. వచ్చే వారం నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి ఆగస్టు 15లోగా పూర్తి చేస్తామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులకు రూ.2,200 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.


అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. వారం రోజుల్లో ఆ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.500 కోట్లతో ఆర్‌అండ్‌ బీ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2024 | 03:20 AM

Advertising
Advertising