TG Politics: అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - May 19 , 2024 | 02:42 PM
తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందని.. ఈ ఎన్నికల్లోనూ గెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ధీమా వ్యక్తం చేశారు.
యాదాద్రి: తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందని.. ఈ ఎన్నికల్లోనూ గెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి రెండు కారణాలు ఉన్నాయని.. ఒకటి చేసిన పనిని చెప్పుకోలేదని.. రెండోది కొన్నివర్గాలను దూరం చేసుకోవడంతోనే తాము ఓడిపోయామని చెప్పుకొచ్చారు. ఆదివారం బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరులో బీఆర్ఎస్ కేడర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు వేసే ముందు పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలను చూడాలని సూచించారు.
భర్తపై దాడి.. భార్య ప్రతీకారం..
ఈ ఎన్నికల్లో ఒక వైపు బిట్స్ పిలానీలో చదువుకున్న అభ్యర్థి , మరో పార్టీ వైపు బ్లాక్ మెయిలర్, లాబీయింగ్ , పైశాచిక ఆనందం పొందే అభ్యర్థి ఉన్నారని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అభ్యర్థులను చూసి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య గుడి కట్టారని చెబుతూ.. బీజేపీ అభ్యర్థి ఓట్లు అడుగుతున్నారని.. తాము యాదాద్రి గుడి కట్టామని... గుడి పేరుతో తాము ఇంతవరకు ఓట్లు అడగలేదని చెప్పారు. తాము ప్రాజెక్టులు కట్టామని.. అవి కూడా దేవుళ్ల పేరు మీద కట్టామని అయినా తాము దేవుడి పేరుతో ఏ ఎన్నికల్లోనూ ఓట్లు అడగట్లేదని స్పష్టం చేశారు.
కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాక ముందు ఒక మెడికల్ కళాశాల కూడా లేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు మెడికల్ కళాశాలను ప్రకటించారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు నాట్లు వేస్తున్నప్పుడు రైతు బంధు వచ్చింది.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఓట్లు వేస్తున్నప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
TG News: ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చరిత్రత్మకం: ప్రేమేందర్ రెడ్డి
Ponguleti: ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో మంత్రి పొంగులేటి..
Congress: ప్రజాస్వామ్య దేశంలో అద్భుతాలు జరుగుతున్నాయి: చింతా మోహన్
Updated Date - May 19 , 2024 | 07:01 PM