ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: కేసీఆర్, మోదీకి సీఎం రేవంత్ సవాల్

ABN, Publish Date - Nov 30 , 2024 | 06:35 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రుణమాఫీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. దొరల గడీలను కూల్చారని చెప్పారు. పాలమూరులో కృష్ణమ్మ పారుతున్నా ప్రజల కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మహబూబ్‌నగర్‌: రైతు బిడ్డగా పాలమూరు రైతుల కష్టాలు తనకు తెలుసునని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడవద్దని అన్నారు. రుణమాఫీపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇవాళ(శనివారం) మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. అమిస్తాపూర్‌లో రైతు పండుగ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. రైతుల కోసం రూ.54 వేల కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. రైతుల కోసం ఇంకా కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గతేడాది నవంబర్‌ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని తెలిపారు. దొరల గడీలను కూల్చారని చెప్పారు. పాలమూరులో కృష్ణమ్మ పారుతున్నా ప్రజల కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోసం ముంబై, హైదరాబాద్‌కు వలసలు పోయే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.


బీఆర్ఎస్ మోసం చేసింది..

మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తర్వాత... ఇన్నాళ్లకు మళ్లీ పాలమూరు బిడ్డ సీఎం అయ్యారని గుర్తుచేశారు. తనకు వచ్చిన అవకాశాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తున్నానని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లందరూ జూనియర్‌ అయినా తనకు సహకరిస్తున్నారని సీఎం రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతురుణమాఫీని పూర్తి చేసిందా అని ప్రశ్నించారు.వడ్డీతో సహా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్ మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్‌ ఇచ్చింది వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లే అని కేసీఆర్‌ అనలేదా అని నిలదీశారు.


రైతులకు పండుగ తెచ్చాం..

తమ ప్రభుత్వం మాత్రం వరి వేస్తే.. రూ.500 బోనస్‌ ఇచ్చి.. వరి రైతులకు పండుగ తెచ్చిందని ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరానికి రూ.1.02 లక్షల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. మూడేళ్లు నిండకుండానే కాళేశ్వరం కూలిందని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది తెలంగాణలో 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి పండిందని తెలిపారు.దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రుణమాఫీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. సాగుకు ఉచిత కరెంట్‌ పేటెంట్‌ హక్కు కాంగ్రెస్‌దేనని తెలిపారు. ఎవరెవరో వచ్చి పాలమూరును దత్తత తీసుకుంటానని ప్రకటించారని.. ఆయన ఈ జిల్లాకు చేసిందేమీ లేదని అన్నారు. మన ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేందుకు కేసీఆర్‌కు మనసు రాలేదని.. ఎంపీగా గెలిపించిన జిల్లాకు కేసీఆర్‌ ఏం చేశారో చెప్పాలని సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రశ్నించారు.


అభివృద్ధిని అడ్డుకోవద్దు

‘‘గతంలో ఎవరూ భూసేకరణ చేయలేదా. ...ప్రాజెక్టులు కట్టలేదా.. పరిశ్రమలు నిర్మించలేదా. నా జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి.. ప్రజలకు ఉపాధి కల్పించాలని భావించాను. మాయగాళ్ల మాటలు విని పరిశ్రమలను అడ్డుకుంటున్నారు. మాయగాళ్ల మాటలు విని లగచర్ల ప్రజలు కేసుల్లో ఇరుకున్నారు. జిల్లాను అభివృద్ధి చేయాలంటే భూసేకరణ చేయాలా.. వద్దా. అధికారులను కొడితే శ్రీశైలం.. సాగర్‌ ప్రాజెక్టులు పూర్తయ్యేవా. మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు. కేసీఆర్‌కే గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫామ్‌ హౌస్‌ ఉంది. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుకు పెద్దపెద్ద ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. ప్రజలను రెచ్చగొట్టి కేసుల పాల్జేసి వాళ్లు వెళ్లి ఫామ్‌హౌస్‌లో ఉంటారు. కేసీఆర్‌ చేసిన దోపిడీకి ప్రజలు, కాంగ్రెస్‌ ప్రభుత్వం బలైపోయింది. మల్లన్నసాగర్‌లో భూమి పోతే రైతు చితిపేర్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు మల్లారెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ న్యాయం చేసిందా. భూములు కోల్పోతున్నవారు పరిహారం అడగండి ఇస్తాను. కావాలంటే ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అయినా ఇస్తాం.మాయగాళ్ల మాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 07:28 PM