ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srinivasa Reddy: కేంద్రమంత్రుల సహకారం తీసుకుంటాం.. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Jun 28 , 2024 | 04:21 PM

తమకు రాజకీయాలం కంటే అభివృద్ధే ముఖ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి (MLA Yennam Srinivasa Reddy) తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు.

MLA Yennam Srinivasa Reddy

మహబూబ్ నగర్: తమకు రాజకీయాలం కంటే అభివృద్ధే ముఖ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి (MLA Yennam Srinivasa Reddy) తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. త్వరలోనే వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 37 కోట్ల రూపాయల వ్యయంతో డ్రైనేజీ,సీసీ రోడ్ల ఏర్పాటుకు త్వరలో టెండర్లు ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. బీఆర్ఎస్.ప్రభుత్వ హయాంలో 7లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారని.. ఇటీవలే 38వేల కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించామన్నారు. గత ప్రభుత్వ పాపాన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కునారిల్లి పోయిందని చెప్పారు.


అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం కోసం టెండర్ ప్రక్రియలో మెఘ కంపెనీ చేజిక్కించుకుంది. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ల సహకారంతో కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకు రావడానికి కృషి చేస్తున్నామని వివరించారు. బడులు మొదలైన మొదటి రోజునే పుస్తకాలు, స్కూల్ డ్రెస్ లు పంపిణీ చేశామని తెలిపారు. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ప్రమోషన్ల బదిలీలు పారదర్శకంగా ఆన్ లైన్‌లో చేపడుతున్నామన్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక సదూయిపాయల కల్పిస్తున్నా మన్నారు.


మహిళా సంఘాల పర్యవేక్షణలతోనే ఈ కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణంలో ఆగిపోయిన కట్టడాల్లో అవసరమైన మార్పులు చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథలో జరిగిన అవినీతి వల్లే చాలా శాతం వరకు నీరు ప్యూరిపై కాలేక సురక్షిత మంచి నీరు అందడం లేదని అన్నారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం లోతైన అధ్యయనం చేస్తోందని చెప్పారు. పట్టణ సరిహద్దుల్లో ఇటుక బట్టిల వల్ల కాలుష్యం పెరుగుతోందని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేసిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jun 28 , 2024 | 04:21 PM

Advertising
Advertising