నేడు సంక్రాంతి
ABN , Publish Date - Jan 14 , 2024 | 11:14 PM
మూడు రోజుల సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని లోగిళ్లు కళకళలాడుతున్నాయి. బంధుమిత్రుల రాకతో సందడిగా మారాయి. గంగిరెద్దుల విన్యాసాలు, డూడూ బసవన్నల విన్యాసాలు, ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులతో కొత్త శోభ సంతరించుకుంది.

మూడు రోజుల సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని లోగిళ్లు కళకళలాడుతున్నాయి. బంధుమిత్రుల రాకతో సందడిగా మారాయి. గంగిరెద్దుల విన్యాసాలు, డూడూ బసవన్నల విన్యాసాలు, ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులతో కొత్త శోభ సంతరించుకుంది. ప్రజలు ఆదివారం భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున భోగి మంటలు పెట్టి, పాత వస్తువులను అందులో కాల్చేశారు. ఇళ్ల ముందు ముగ్గులు వేశారు. సోమవారం సంక్రాంతిని, మంగళవారం కనుమ పండుగను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా రంగులు, గాలిపటాల విక్రయాల షాపులు రద్దీగా మారాయి.
- ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్