ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Raghunandan: కేటీఆర్, హరీశ్‌రావులకు రఘునందన్ మాస్ వార్నింగ్

ABN, Publish Date - Jul 09 , 2024 | 07:11 PM

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై మరోసారి మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఅర్ చేసిన రాజకీయ దారిద్య్రాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని ధ్వజమెత్తారు.

MP Raghunandan

సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై మరోసారి మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఅర్ చేసిన రాజకీయ దారిద్య్రాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని ధ్వజమెత్తారు. గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్య అతిథిగా రఘునందన్ రావు పాల్గొన్నారు.


‘‘తెలంగాణను భ్రష్టు పట్టించిన , రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసిన బావ బామ్మర్దులు ఇద్దరు కలిసి ఢిల్లీలో సమావేశం పెట్టారు. సిరిసిల్ల ఎమ్మెల్యే నేషనల్ మీడియా ముందు సన్నాయి నొక్కుతుండు. సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసానినీ ఏ రాజ్యాంగం ప్రకారం బీఆర్ఎస్ పార్టీలో తీసుకొని కేసీఆర్ ఎలా మంత్రినీ చేశారు. రాజకీయాల్లో విలువలు ఉండాలని హరీష్‌రావు అంటుండు. సిగ్గులేకుండా ఇదే గజ్వేల్లో రూ.100 ఖర్చు పెట్టీ, ఓటుకు రూ.1000 పంచిన ఆయన ఢిల్లీ పోయి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన దరిద్రం. పార్టీ ఫిరాయింపులకు , భారత రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి పుట్టిందే ఆ పార్టీ. ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ పెడితే ఎవరు భయపడరు. మీరు ఢిల్లీ గేట్ వద్ద నుంచి పార్లమెంట్ దాకా ముక్కు నేలకు రాసి మేము నిన్నటి దాక తప్పు చేసినం భవిష్యత్‌లో తప్పులు చేయమని చేస్తేనే క్షమాపణ కోరితేనే తెలంగాణ గడ్డ మీద తిరగాలి,లేదంటే ఉరికించి కోడతాం’’ అని రఘునందన్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Updated Date - Jul 09 , 2024 | 07:11 PM

Advertising
Advertising
<