ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medical Counseling: రెసిడెన్సీ సర్టిఫికెట్లతో వెయ్యి మందికి పైగా దరఖాస్తు

ABN, Publish Date - Aug 18 , 2024 | 04:35 AM

రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి ‘స్థానికత’ ధ్రువీకరణ కోసం రెసిడెన్సీ సర్టిఫికెట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వెయ్యి మందికి పైగా అభ్యర్థులు ఈ తరహా సర్టిఫికెట్లతో మెడికల్‌ కౌన్సెలింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

  • ముగిసిన నీట్‌ కౌన్సెలింగ్‌ దరఖాస్తు ప్రక్రియ

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి ‘స్థానికత’ ధ్రువీకరణ కోసం రెసిడెన్సీ సర్టిఫికెట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వెయ్యి మందికి పైగా అభ్యర్థులు ఈ తరహా సర్టిఫికెట్లతో మెడికల్‌ కౌన్సెలింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో నీట్‌ కౌన్సెలింగ్‌ దరఖాస్తు ప్రక్రియ గురువారంతో ముగిసింది. మొత్తం 17,700 దరఖాస్తులు వచ్చాయి. గతేడాది 23వేల పైచిలుకు అప్లికేషన్లు రాగా.. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేయకపోవడంతో ఆరు వేల దరఖాస్తులు తగ్గాయి. ప్రస్తుతం తెలంగాణలో 8,715 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి.


ఇందులో బీబీనగర్‌ ఎయిమ్స్‌కు చెందిన 100సీట్లు, ఈఎ్‌సఐ సనత్‌నగర్‌లో 150 సీట్లకు చెందిన కౌన్సెలింగ్‌ను కేంద్రమే నిర్వహిస్తుంది. మిగతా సీట్లకు హెల్త్‌ యూనివర్సిటీ కౌన్సెలింగ్‌ నిర్వహించి, సీట్లను కేటాయిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 4,115 సీట్లున్నాయి. ఇందులో 15ు అంటే 617 సీట్లు అఖిల భారత కోటాకు వెళ్తాయి. మిగిలిన 3,498 సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రైవేటులో 4,600 సీట్లుండగా.. అందులో 50ు అంటే 2,300 సీట్లను కూడా కన్వీనర్‌ కోటాలోనే హెల్త్‌ వర్సిటీ భర్తీ చేస్తుంది. ఇదిలా ఉండగా, కొందరు అభ్యర్థులు అర్హత లేకపోయినప్పటికీ రెసిడెన్సీ సర్టిఫికెట్లు పొంది కౌన్సెలింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - Aug 18 , 2024 | 04:35 AM

Advertising
Advertising
<