ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Indiramma Scheme: నెలరోజుల్లోపు 4.5 లక్షల ఇళ్లు!

ABN, Publish Date - Aug 04 , 2024 | 03:34 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడత కేటాయింపుల్లో భాగంగా నెలరోజుల్లోపు 4.5 లక్షల ఇళ్లు మంజూరుచేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు తొలి విడతలోనే నియోజకవర్గానికి 3,500 ఇళ్లను యుద్ధ ప్రతిపాదికన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

  • తొలి విడతలో యుద్ధ ప్రాతిపదికన మంజూరు

  • రుణమాఫీ సమస్యలు నెలాఖరులోగా కొలిక్కి

  • ఈ నెల 15 వరకు మాఫీ పూర్తి: పొంగులేటి

  • కాళేశ్వరంపై బీఆర్‌ఎస్‌ గోబెల్స్‌ ప్రచారం.. మంత్రి శ్రీధర్‌బాబు

భూపాలపల్లి, గణపురం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడత కేటాయింపుల్లో భాగంగా నెలరోజుల్లోపు 4.5 లక్షల ఇళ్లు మంజూరుచేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు తొలి విడతలోనే నియోజకవర్గానికి 3,500 ఇళ్లను యుద్ధ ప్రతిపాదికన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పేదలకు ఇళ్లపై అప్పటి సీఎం కేసీఆర్‌ మాయమాటలు చెప్పారని.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పేదల కోసం 1.5 లక్షల ఇళ్లే కట్టించారని.. తాము ఇవాళ తొలి విడతలోనే 4.5 లక్షల ఇళ్లను కట్టనున్నామని చెప్పారు. వైఎస్సార్‌ హయాంలో గ్రామ గ్రామన పేదల కోసం కావాల్సినన్ని ఇళ్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టించిందని, ఇప్పుడూ అలాగే గ్రామాల్లో తప్పకుండా పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.


శనివారం భూపాలపల్లి జిల్లాలో గణపురం మండలం గాంధీనగర్‌లో ఇండస్ట్రియల్‌ పార్క్‌ శంకుస్థాపన, భూపాలపల్లి డ్రగ్స్‌ ఫార్మసీ భవన ప్రారంభోత్సవం, వివిధ శాఖల సమీక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబుతో కలిసి శ్రీనివాస్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వతేదీ లోపు రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని, రుణమాఫీ క్రమంలో తలెత్తిన సమస్యలను కూడా నెలాఖరులోపు పరిష్కరించి మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. తాము ధరణి కంటే మెరుగ్గా భూమాత పేరుతో కొత్త ఆర్వోఆర్‌ తెస్తామని చెప్పారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం తొండాట ఆడుతోందని విమర్శించారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు.


భూపాలపల్లి లాంటి మారుమూల గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమే ఇండస్ట్రియల్‌ పార్క్‌లను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ పార్టీ కుట్ర చేసిందన్నట్లుగా బీఆర్‌ఎస్‌ నేతలు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని, నిజంగా కాంగ్రెస్‌ పార్టీ కుట్రలు చేసి ఉంటే అసలు ప్రాజెక్టుకు పునాది రాయే పడేది కాదన్నారు. ప్రాజెక్టులో అవినీతి జరిగినందునే నీళ్లివ్వకుండానే కూలిపోయిందన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక బీఆర్‌ఎస్‌ నేతలు సంకుచిత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీకి సంబంధించి మొత్తం ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇంకా ఏమైనా సమస్యలు మిగిలి ఉంటే వాటిని పరిష్కరించడం కోసం మంత్రివర్గం కూర్చొని చర్చిస్తుందని చెప్పారు.

Updated Date - Aug 04 , 2024 | 03:34 AM

Advertising
Advertising
<