Telangana: బీఆర్ఎస్ రాష్ట్రాన్ని లూఠీ చేసింది.. మంత్రి సీతక్క ఫైర్..
ABN , Publish Date - Jan 28 , 2024 | 03:26 PM
గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని లూఠీ చేసిందని మంత్రి సీతక్క అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఫైర్ అయ్యారు.
గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని లూఠీ చేసిందని మంత్రి సీతక్క అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్ లో కేటీఆర్ పెంచుకునే శునకాలకు రూ.12 లక్షలతో ఇళ్లు కట్టించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న పేదలకు మాత్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని మంత్రి సీతక్క మండిపడ్డారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. గుర్తూరు తండా, కాసిందేవి పేటలో నూతన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించారు.
కాగా.. సమ్మక్క-సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. జాతర ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే భక్తులు బారులు తీరుతున్నారు. దీంతో మేడారం జనసంద్రంగా మారుతోంది. ఈ క్రమంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.