ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Konda Vishweshwar Reddy: రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ విమర్శలు

ABN, Publish Date - Aug 11 , 2024 | 04:48 AM

రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ నాయకులు కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ‘‘ఓవైపు... బడ్జెట్‌లో వాళ్ల ఐడియాలని కాపీ కొట్టారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

  • ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ నాయకులు కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ‘‘ఓవైపు... బడ్జెట్‌లో వాళ్ల ఐడియాలని కాపీ కొట్టారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బడ్జెట్‌ బాగాలేదని వాళ్లే విమర్శిస్తున్నారు. అంటే వాళ్ల ఐడియాలు బాగోలేవనా..?’’ అని ప్రశ్నించారు. శనివారం, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విశ్వేశ్వర్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.


అమరావతికి రూ. 15 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందంటున్న కాంగ్రెస్‌ నాయకులు, తెలంగాణకూ రూ. 40 వేల కోట్లు ఇప్పటికే ఇచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటినప్పటికీ... ఆరు నెలల్లో రూ.35 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని విశ్వేశ్వర్‌రెడ్డి వివరించారు. వక్ఫ్‌ బోర్డు బిల్లు అనేది ముస్లింలకు వ్యతిరేకమంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు వక్ఫ్‌ బోర్డులను గుప్పిట్లో పెట్టుకుని పేద ముస్లింలకు అందాల్సిన నిధులు అందనివ్వడంలేదని ఆరోపించారు.

Updated Date - Aug 11 , 2024 | 04:48 AM

Advertising
Advertising
<