Rythu Bandhu: రైతుబంధుకు బ్రేక్
ABN , Publish Date - Feb 17 , 2024 | 12:12 AM
రైతుబంధు సాయానికి బ్రేక్ పడినట్టేనని అంతా భావిస్తున్నారు. ఈనెల 12వ తేదీ వరకే రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఆ తరువాత రోజు నుంచి రైతుబంధు సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలో జమకావడం లేదు.
ఈనెల 12వ తేదీన నిలిచిన ప్రక్రియ
ముందుకు సాగని పథకం
నేటికీ మూడెకరాలకు మించని సాయం
ఉమ్మడి జిల్లాలో రూ.493.69కోట్లు జమ
యాసంగి ముగుస్తున్నా అందని పెట్టుబడులు
నల్లగొండ: రైతుబంధు సాయానికి బ్రేక్ పడినట్టేనని అంతా భావిస్తున్నారు. ఈనెల 12వ తేదీ వరకే రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఆ తరువాత రోజు నుంచి రైతుబంధు సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలో జమకావడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్ ముగుస్తున్నా, రైతుబంధుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదు.
ఎన్నికలకు ముందే రైతుబంధు సాయం రావాల్సి ఉండగా, ఎన్నికల కమిషన్ జోక్యంతో ఈ ప్రక్రియ నిలిచింది. అసెం బ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉందని ప్రకటించింది. ప్రతిపక్షాలు, రైతుల నుంచి ఒత్తిడి వస్తుండటంతో ప్రభుత్వం డిసెంబరు 11వ తేదీ నుంచి రైతుబంధు సాయా న్ని అందజేసున్నట్టు ప్రకటించింది. కాగా, అప్పటి నుంచి రైతుబంధు నగదు జమ నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకు మూడెకరాల రైతులకు కూడా పూర్తిమొత్తంలో సాయం అందలేదు. దీంతో యా సంగి సీజన్ ప్రారంభంలో చేతిలో పెట్టుబడి డబ్బు లేక రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశారు. ఇటీవలే ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో రైతుబంధు ఇస్తామని ప్రకటించగా, 67రోజులైనా సొమ్ము అందకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు.
మళ్లీ బ్యాంకర్ల నుంచి రుణమాఫీ లెక్కల సేకరణ
అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల నుంచి రైతుల వివరాలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వం నిధుల కొరతతో రుణమాఫీని నిలిపివేయగా, కొత్త ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018 ఎన్నికలకు ముందు రూ.1లక్ష వరకు రుణమాఫీ చేస్తానని ప్రకటించినా అది ఆచరణ సాధ్యం కాలేదు. గత ఏడాది ఎన్నికల ముందు ఆగస్టు 15న రుణమాఫీని మళ్లీ ప్రారంభించినా కొంతమందికే లబ్ధి చేకూరింది.
ఖజానా ఖాళీనా? ప్రణాళికా లోపమా?
ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి గత ప్రభు త్వం 11 విడతలుగా రంగారెడ్డి జిల్లా ట్రెజరీ కార్యాల యం నుంచి మానిటరింగ్ చేస్తూ రైతుబంధు సొమ్మును జమచేసింది. ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం రైతుబంధు నిధులు సిద్ధంగా ఉన్నాయని, ఎన్నికల కమిషన్‌కు ఓకే చెబితే జమ చేస్తామని అప్పటి మంత్రి హారీ్‌షరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో నిధుల విడుదల ను ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసలు రైతుబంధు కు సంబంధించిన నిధులు లేనే లేవని, ఖజానా ఖాళీ గా ఉందని ప్రకటించడం గమనార్హం. ఖజానా ఖాళీ అవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు నిధులు జమ చేస్తుందా? లేదా? లేక ప్రణాళికా లోపమా అనేది తేలడం లేదు. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు రైతుబంధుపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించలేదు. అసలు ఎన్ని ఎకరాలకు రైతుబంధు ఇస్తారనే దానిపై స్పష్టత లేదు.
రూ.493.69కోట్ల మేర చెల్లింపులు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు సాయం ప్రారంభించి 67 రోజులు గడిచినా పూర్తిస్థాయిలో మాత్రం నేటికీ ముందడు గు పడలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మొత్తం రూ.1,450 కోట్లు పెట్టుబడి సాయంగా అందాల్సి ఉండగా, ఇప్పటి వర కు కేవలం రూ.493.69కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమయ్యాయి. నల్లగొండ జిల్లాలో 5,42,106మంది రైతులకు ఇప్పటి వరకు 3,75,956 మంది ఖాతాల్లో రూ.251.51కోట్లు జమయ్యాయి. ట్రెజరీకి 4,72,502 మందికి సంబంధించిన వివరాలతో పాటు రూ.434.53కోట్లకుపైగా నగదు విడుదలైనట్టు అధికారులు చెబుతుండగా, వాస్తవంగా రూ.251కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమయ్యాయి. అయితే ట్రెజరీకి పంపించిన నగదు కాగితాలపై లెక్కలేనా అనే అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో 2,93, 689మంది రైతులకు 2,12,204మందికి రూ.130.8కోట్లు జమయ్యాయి. యాదాద్రి జిల్లాలో 1,81,63మంది రైతులకు రూ.112.10కోట్లు జమయ్యాయి. దీంతో ఇకపై రైతుబంధు అమలు అవుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా ఎకరానికి రెం డు పంటలకు రూ.15వేలు ఇస్తామని పార్టీ నాయకులు హా మీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించకపోగా, గత ప్రభుత్వం అమలు చేసి న రైతుబంధు సాయాన్ని సైతం కొనసాగించకపోవడం గమనార్హం.
మూడున్నర ఎకరాలకు రైతుబంధు రాలేదు : వనపర్తి వెంకటయ్య, రైతు, రామలింగాలగూడెం, తిప్పర్తి
నాకు మూడున్నర ఎకరాల భూమి ఉంది. ఇప్పటి వరకు రైతుబంధు జమకాలేదు. ఈ ఏడాది పెట్టుబడుల కోసం ఇబ్బందులు ఎదుర్కొ న్నాం. యాసంగి సీజన్ ముగుస్తున్నా రైతుబంధు సాయం చేయకపోవడంతో అప్పుపై వడ్డీ పెరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైతుబంధు సాయాన్ని ఇచ్చి ఆదుకోవాలి.
ప్రతీ ఒక్క రైతుకు పెట్టుబడిసాయం: పి.శ్రవణ్‌కుమార్, నల్లగొండ జేడీఏ
అర్హులైన ప్రతీ ఒక్క రైతుకు రుణమాఫీ అవుతుంది. అదేవిధం గా రైతుబంధు నిధులు ప్రతీ రోజు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి.రుణమాఫీకి సంబందించి ప్రభుత్వంనుంచి ఇంకా ఎ లాంటి మార్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వం సమీక్ష నిర్వహించిన అనంతరం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలు రాగానే రుణమాఫీ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతుంది.