ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Graduate MLC Election 2024: తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక..

ABN, Publish Date - May 27 , 2024 | 04:26 PM

Telangana Graduate MLC By Elections: తెలంగాణలో(Telangana) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్(MLC Election Polling) ముగిసింది. ఖమ్మం(Khammam)-నల్లగొండ(Nalgonda)-వరంగల్(Warangal) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.

Graduate MLC By Elections

Telangana Graduate MLC By Elections: తెలంగాణలో(Telangana) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్(MLC Election Polling) ముగిసింది. ఖమ్మం(Khammam)-నల్లగొండ(Nalgonda)-వరంగల్(Warangal) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు అధికారులు.

మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరిగింది. జూన్ 5వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నిక బరిలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్), బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. మొత్తంగా 52 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు.


ప్రశాంతంగా పోలింగ్..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకే 60 శాతం పోలింగ్ దాటింది. ఇంకా క్యూలైన్లలో చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. వారి ఓటింగ్ పూర్తయితే.. పోలింగ్ శాతం మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే, 4 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను నల్లగొండ స్ట్రాంగ్ రూమ్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నిక ఫలితాలను జూన్ 5వ తేదీన వెల్లడించనున్నారు.

For More Telangana News and Telugu News..

Updated Date - May 27 , 2024 | 04:26 PM

Advertising
Advertising