Share News

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 24,905

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:12 AM

శాసనమండలి నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల సం ఖ్య తేలింది. తుది సవరణల అనంతరం ఆదివారం సాయంత్రానికి మొత్తం నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 24,905గా నమోదైంది. ఈమేరకు సోమవారం తుది జాబితాను నియోజకవర్గ ఎన్నికల అధికారి, నల్లగొండ కలెక్టర్‌ ఇలాత్రిపాఠి ప్రకటించనున్నారు.

 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 24,905

నేడు తుది జాబితా

హన్మకొండ, నల్లగొండ, ఖమ్మంలోనే అత్యధిక ఓటర్లు

సిద్ధిపేట, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో స్వల్పం

నల్లగొండ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): శాసనమండలి నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల సం ఖ్య తేలింది. తుది సవరణల అనంతరం ఆదివారం సాయంత్రానికి మొత్తం నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 24,905గా నమోదైంది. ఈమేరకు సోమవారం తుది జాబితాను నియోజకవర్గ ఎన్నికల అధికారి, నల్లగొండ కలెక్టర్‌ ఇలాత్రిపాఠి ప్రకటించనున్నారు. ఓటర్లలో అత్యధికంగా హన్మకొండ జిల్లాలో 5,098 మంది ఉండగా, ఆ తర్వాత నల్లగొండలో 4,483 మంది, ఖమ్మం జిల్లాలో 3,955 మంది ఓటర్లు నమోదయ్యారు. అత్యల్పంగా సిద్ధిపేట జిల్లాలో 163 మంది ఓటర్లు ఉండగా, ఆతర్వాత భూపాలపల్లిలో 323 మంది, ములుగు జిల్లాలో 612 మంది మాత్రమే ఓటర్లు నమోదయ్యారు. మొత్తం 12 జిల్లాల్లో, 191 మండలాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గంలో 200 పోలింగ్‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ఓటర్లలో పురుషులు 14940 మంది ఉండగా, మహిళలు 9,965 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం టీఎ్‌సయూటీఎఫ్‌ నేత అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ముందు పూల రవీందర్‌, చుక్కారామయ్య ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. రానున్న ఎన్నికల్లో నర్సిరెడ్డి మరోసారి బరిలో నిలుస్తుండగా, పీఆర్‌టీయూ టీఎస్‌ అభ్యర్థిగా శ్రీపాల్‌రెడ్డి, జాక్టో అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్‌, టీజీ పీఆర్‌టీయూ నుంచి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి బరిలో ఉంటామని ఇప్పటికే ప్రకటించారు. తపస్‌ నుంచి సాయిరెడ్డి, కస్తూరి సాయిచరణ్‌తో పాటు మరికొందరు నేతలు సంఘం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు.

జిల్లా మండలాలు పోలింగ్‌స్టేషన్లు పురుషులు మహిళలు మొత్తం

సిద్దిపేట 4 4 120 43 163

జనగాం 12 12 556 365 921

హనుమకొండ 11 15 2884 2214 5098

వరంగల్‌ 13 13 1381 844 2225

మహబూబాబాద్‌ 18 16 1083 535 1618

జె.భూపాలపల్లి 7 7 211 112 323

ములుగు 9 9 394 218 612

భద్రాద్రికొత్తగూడెం 23 23 1038 911 1949

ఖమ్మం 21 24 2300 1655 3955

యాదాద్రి 17 17 595 326 921

సూర్యాపేట 23 23 1690 947 2637

నల్లగొండ 33 37 2688 1795 4483

మొత్తం 191 200 14,940 9,965 24,905

Updated Date - Dec 30 , 2024 | 12:12 AM