ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: బాన్సువాడలో పాముతో చెలగాటం.. చివరికి యువకుడి పరిస్థితి..

ABN, Publish Date - Sep 06 , 2024 | 01:14 PM

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత పాపులర్ అయ్యేందుకు ఔత్సాహికులు వింతవింత చేష్టలు చేస్తున్నారు. పది మందిలో విన్యాసాలు చేస్తూ కొంతమంది నవ్వులపాలు అవుతుంటే మరికొంత మంది విచిత్రంగా ప్రవర్తిస్తూ నలుగురితో తిట్లు తింటున్నారు.

Banswada

కామారెడ్డి: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత పాపులర్ అయ్యేందుకు ఔత్సాహికులు వింతవింత చేష్టలు చేస్తున్నారు. పది మందిలో విన్యాసాలు చేస్తూ కొంతమంది నవ్వులపాలు అవుతుంటే మరికొంత మంది విచిత్రంగా ప్రవర్తిస్తూ నలుగురితో తిట్లు తింటున్నారు. కొనిసార్లు అతి చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వారిని పోలీసులు జైలుకు సైతం పంపిస్తున్నారు. అయితే సోషల్ మీడియా మోజులో పడి కొంతమంది ఏకంగా ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్న సందర్భాలు లెక్కలేనన్ని కనిపిస్తున్నాయి.


తాజాగా అలాంటి ఘటనే ఒకటి కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పాముతో చెలగాటం ఆడిన యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏదో చేద్దాం.. పాపులర్ అవుదాం అనుకుని చివరకు ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి నెట్టాడు. బాన్సువాడ మండలం దేశాయిపేట్ పోచారం కాలనీకి చెందిన శివరాజు అనే యువకుడికి విష సర్పం ఎక్కడ దొరికిందో తెలియదు.. కానీ అతడు మాత్రం దాంతో విన్యాసాలు చేశాడు.


ఏకంగా పాము తలను నోట్లో పెట్టుకుని ఫొటోలు, వీడియోలకు ఫొజులు ఇచ్చాడు. విష సర్పాన్ని చాలా సేపు నోట్లోనే ఉంచుకుని చేతులతో నమస్కరిస్తూ వీడియోలో కనిపించాడు. ఆ సమయంలో పాము చాలా సేపు గిలగిలా కొట్టుకుంటూ కనిపించింది. దారిన పోయే వారంతా యువకుడు చేసిన విన్యాసాన్ని చూసి షాకయ్యారు. అయితే శివరాజుతో సహా పక్కనున్న వారందరికీ ఆ పామే అతని ప్రాణాలు తీస్తుందని అప్పడు తెలియలేదు.


అలాగే కాసేపు వీడియోలు, ఫొటోలు తీసినా అనంతరం యువకుడు పామును నోటి నుంచి బయటకు తీశాడు. ఆ తర్వాత కాసేపు దాంతో విన్యాసాలు చేశాడు. ఆ సమయంలో విష సర్పం ఒక్కసారిగా యువకుడి చేతిని కాటేసింది. పాము కాటుతో ఉలిక్కిపడిన అతను దాన్ని పక్కకు పడేసి కేకలు పెట్టాడు. అప్రమత్తమైన స్నేహితులు, స్థానికులు యువకుణ్ని హుటాహుటిన బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విషం శరీరం మెుత్తం పాకడంతో యువకుడు చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.


ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ మారింది. "పాముతో పెట్టుకుంటే ఇలాంటి ఉంటుందని కొందరూ, అది విష సర్పం అని తెలుసు కదా ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నావని మరికొందరూ.. అతి చేసే వారికి ఇలానే జరుగుతుందని ఇంకొందరు" కామెంట్లు పెడుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Viral Video: అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ.. వృద్ధురాలి వద్దకు వచ్చిన ఎద్దు.. చూస్తుండగానే..

Viral News: పంట పొలాల్లో హెలికాప్టర్ ల్యాండింగ్.. కూలీలు ఏం చేశారో చూడండి

Updated Date - Sep 19 , 2024 | 11:28 AM

Advertising
Advertising