ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth: కేసీఆర్ కుటుంబం పతనమైంది.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Mar 17 , 2024 | 12:46 PM

హైదరాబాద్ విమోచన దినానికి, 2023 డిసెంబర్ 3వ తేదీకి ఒకే చరిత్ర ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) అన్నారు. 7 తరలుగా నిజాం రాజ్యాన్ని పాలించిన పాలకుల నుంచి ప్రజలకు విముక్తి లభించినట్లే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి, ప్రజలకు విముక్తి లభించిందని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు.

హైదరాబాద్ విమోచన దినానికి, 2023 డిసెంబర్-03వ తేదీకి ఒకే చరిత్ర ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) అన్నారు. 7 తరాలుగా నిజాం రాజ్యాన్ని పాలించిన పాలకుల నుంచి ప్రజలకు విముక్తి లభించినట్లే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి, ప్రజలకు విముక్తి లభించిందని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. ఎన్ని మంచి పనులు చేసినా బానిసలుగానే చూశారని, స్వేచ్చను లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం ప్రభువుల ఆగడాలు తట్టుకోలేక నాడు తిరుగుబాటు చేస్తే నేడు గులాబీ నేతల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్నారని వివరించారు. స్వేచ్ఛ లాక్కుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

1948 సెప్టెంబర్ 17లో దేశం ఒక్కసారిగా మన వైపు చూసింది. ప్రపంచంలో ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ వాళ్లకు స్పూర్తి ఇచ్చింది. అరాచకం నుంచి విముక్తి పొందేందుకు సాయుధ పోరాట జరిగింది. నిజాం హయాంలోని ఖాసిం రజ్వీ ఆధిపత్యాన్ని తాను చలాయించాలని కేసీఆర్ అనుకున్నారు. సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ పోరాటంలో కేసిఆర్ కుటుంబం పతనం అయ్యింది. నిజాం, కేసిఆర్ ఇద్దరి పేర్లు మాత్రమే వేరు. కానీ సారూప్యత ఒకటే.

- ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి


బతుకమ్మ పండుగను కొందరు వ్యాపార వస్తువుగా, ఆటవస్తువుగా మార్చారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. బతుకమ్మ, బోనాలు అనాదిగా తెలంగాణలో జరుపుకుంటున్న పండుగలు అని చెప్పారు. ఎవరు ఉన్నా లేకున్నా ఈ పండుగలు జరుగుతాయని చెప్పారు. ప్రైవేట్ చేతిలో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థకు అప్పగించామన్నారు. ధరణి పోర్టల్ ను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే అసలు విషయం బయటపడుతుందని పేర్కొ్న్నారు. తప్పులకు కారణమైన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 17 , 2024 | 12:55 PM

Advertising
Advertising