ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Patancheru: మహిపాల్‌రెడ్డి చూపు.. బీజేపీ వైపు?

ABN, Publish Date - Jun 27 , 2024 | 04:46 AM

బీఆర్‌ఎ్‌సకు మరో షాక్‌ తగలనుందా? పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారా? ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జరిపిన తనిఖీల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చారా? అంటే.. మహిపాల్‌రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • కమలం గూటికి చేరనున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే?

  • ఈడీ తనిఖీలతో ఆందోళనలో బీఆర్‌ఎస్‌ నేత?

  • ఢిల్లీకి రహస్య టూర్‌

పటాన్‌చెరు, జూన్‌ 26: బీఆర్‌ఎ్‌సకు మరో షాక్‌ తగలనుందా? పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారా? ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జరిపిన తనిఖీల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చారా? అంటే.. మహిపాల్‌రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం జహీరాబాద్‌ మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు బీబీ పాటిల్‌తో మహిపాల్‌రెడ్డి సమావేశం కావడం కూడా ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. అయితే గతంలో బీఆర్‌ఎస్‌ తరఫున రెండుసార్లు జహీరాబాద్‌ ఎంపీగా పనిచేసిన బీబీ పాటిల్‌తో మహిపాల్‌రెడ్డికి సన్నిహిత సబంధాలున్నందున.. ఆ చనువుతో ఆయనను కలిశారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ, గత పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునంధన్‌రావు పటాన్‌చెరు నియోజకవర్గంలో లక్ష పైచిలుకు ఓట్లు సాధించడంతో.. ఓటుబ్యాంకు బీజేపీ వైపు మళ్లిందన్న సంకేతాలు కనిపించాయి.


బీఆర్‌ఎస్‌ ఏకంగా మూడో స్థానానికి పడిపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న స్థానిక బీఆర్‌ఎస్‌ నేతల మెదళ్లను తొలుస్తోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఇదే ఫలితాలు వస్తే కేడర్‌ మిగలదన్న భావన వ్యక్తమవుతోంది. అయితే ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తొలుత కాంగ్రె్‌సలో చేరతారని ప్రచారం జరిగినా.. ఈడీ సోదాల తరువాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. పటాన్‌చెరు నియోజకవర్గంలో తన ప్రధాన అనుచరులుగా చెప్పుకొనే వారికి సైతం చెప్పకుండా ఆయన ఢిల్లీకి వెళ్లారు. కేవలం కేసు పనిమీద న్యాయవాదులను కలిసేందుకు వెళ్లినట్లు ఆయన అనుచరులు చెబుతున్నా.. బీజేపీ నేత బీబీ పాటిల్‌తో మంతనాలకు సంబంధించి మాత్రం సమాధానం కరువైంది. అంతేకాకుండా బీజేపీ సంగారెడ్డి జిల్లా ముఖ్యనాయకుడు సైతం ఎమ్మెల్యే వెంట వెళ్లడం అనుమానాలు మరింత బలపడేలా చేస్తోంది.


కాంగ్రెస్‌ చేరేందుకు స్థానికంగా వ్యతిరేకత

మహిపాల్‌రెడ్డి తొలుత కాంగ్రె్‌సలో చేరేందుకే ప్రయత్నాలు చేశారని, కానీ.. ఆయన ప్రయత్నాలను స్థానిక కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారని సమాచారం. నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కాట శ్రీనివా్‌సగౌడ్‌, మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన నీలం మధు ముదిరాజ్‌.. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చేరికను వ్యతిరేకించినట్లు తెలిసింది. మరోవైపు మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఇటీవల తనిఖీ చేసి పెద్ద ఎత్తున స్థిరాస్థులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతోపాటు బినామీలుగా భావిస్తున్న కొందరిని ఈడీ కార్యాలయానికి పిలిపించి అక్రమాస్తులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.


కిష్టారెడ్డిపేట గ్రామానికి చెందిన ఓ బిల్డర్‌ మధుసూదన్‌రెడ్డికి బినామీగా వ్యవహరిస్తునట్లు ఆధారాలు లభ్యం కావడంతో ఆయ న నుంచి వివరణ అడిగారు. మిగతా బినామీ వ్యక్తు లు ఈడీ నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారని తెలిసింది. ఎవరికి ఎప్పుడు ఈడీ నుంచి పిలుపు వస్తుందో, ఎవరి ఇళ్లలో సోదాలు చేస్తారోనన్న భయంతో వారు బిక్కుబిక్కుమంటున్నారు.

Updated Date - Jun 27 , 2024 | 04:46 AM

Advertising
Advertising