ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medical Collage: అనుమతివ్వలేం!

ABN, Publish Date - Jul 09 , 2024 | 03:48 AM

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎనిమిది వైద్య కళాశాలల అనుమతులకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్‌ లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ (ఎల్‌వోపీ) ఇవ్వలేదు. అనుమతులపై జాతీయ వైద్య కమిషన్‌ తాజాగా కొత్త కాలేజీల ప్రిన్సిపల్స్‌కు మెయిల్‌ పంపింది.

  • రాష్ట్రంలో 8 కొత్త వైద్య కళాశాలకు ఎల్‌వోపీ లేదు

  • అధ్యాపకులు లేరు.. ‘ఇన్‌, ఔట్‌ పేషంట్‌’ లేదు

  • లోపాలు వివరిస్తూ జాతీయ వైద్య కమిషన్‌ మెయిల్‌

హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎనిమిది వైద్య కళాశాలల అనుమతులకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్‌ లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ (ఎల్‌వోపీ) ఇవ్వలేదు. అనుమతులపై జాతీయ వైద్య కమిషన్‌ తాజాగా కొత్త కాలేజీల ప్రిన్సిపల్స్‌కు మెయిల్‌ పంపింది. ఆ కాలేజీల్లో ఉన్న లోపాలను అందులో పేర్కొంది. పరిస్థితులు ఇలాగే ఉంటే కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా జోగులాంబ జిల్లా గద్వాల్‌, నారాయణ్‌ పేట్‌, ములుగు, మెదక్‌, యాదాద్రి భువనగిరి, వరంగల్‌ జిల్లా నర్సంపేట్‌లో, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో 50 ఎంబీబీఎస్‌ సీట్ల చొప్పున వైద్యవిద్య కళాశాలల ఏర్పాటు కోసం సర్కారు నిరుడు దరఖాస్తు చేసింది.


జాతీయ వైద్య కమిషన్‌ నిబంధనల మేరకు 50 సీట్లతో ఏర్పాటుకాబోయే మెడికల్‌ కాలేజీల్లో 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కలిపి మొత్తంగా 59 మంది ఫ్యాకల్టీ ఉండాలి. కానీ మనదగ్గర 8 కొత్త కాలేజీల్లో ప్రిన్సిపల్స్‌, ఆస్పత్రి సూపరింటిండెంట్లు తప్ప మిగతా స్టాఫ్‌ అంటూ ఎవరూ లేరు. సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు కూడా లేకుండానే కాలేజీల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. కొద్ది రోజుల క్రితం తనిఖీలకు వచ్చిన ఎన్‌ఎంసీ బృందం జీరో ప్యాకల్టీ ఉండటంపై నోరెళ్లబెట్టినట్లు సమాచారం. అసలు ఫ్యాకల్టీ లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఫైనల్‌ తనిఖీలకు చేసిన తర్వాత అన్ని నిబంధనల మేరకు ఉంటే ఎల్‌వోపీను ఎన్‌ఎంసీ ఇస్తుంది. ఎల్‌వోపీ వస్తే అడ్మిషన్ల ప్రక్రియకు ఎటువంటి ఆటంకం ఉండదు. కానీ ఇంతవరకు ఎల్‌వోపీనే కొత్త కాలేజీలకు రాలేదు. అలాగే కొత్త మెడికల్‌ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో అవుట్‌ పేషంట్స్‌, ఇన్‌పేషంట్స్‌పై కూడా ఎన్‌ఎంసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.


కొన్ని బోధనాస్పత్రుల్లో ఓపీ బాగానే ఉన్నప్పటికీ... ఐపీ మాత్రం ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు లేవు. బోధనాస్పత్రుల్లోని ఓపీ, ఐపీ డేటాను ఎన్‌ఎంసీ హెల్త్‌మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(హెచ్‌ఎమ్‌ఐఎ్‌స) ద్వారా తీసుకుంది. దాంతో ఓపీ, ఐపీల బాగోతం బయటపడింది. మెడికల్‌ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లోని రోజువారీ ఓపీ, ఐపీ వివరాలను హెచ్‌ఎమ్‌ఐఎ్‌స పోర్టల్‌లో ఏరోజుకారోజు విఽధిగా నమోదు చేయాలి. ఈ పోర్టల్‌ను కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్వహిస్తుంటుంది. కాగా ఎన్‌ఎంసీ లేవనెత్తిన లోపాలను రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల్లోగా సవరించుకోవాలి. ఆలోగా కూడా లోటుపాట్లును సరిచేసుకోకుంటే అనుమతులివ్వదు.


ఒకవేళ ఇచ్చినా... వాటిని రద్దు చేస్తుంది. కాగా ఎన్‌ఎంసీ లేఖల నేపథ్యంలో రాష్ట్ర వైద్య శాఖ అగమాగం అవుతోంది. ఎలాగైనా సరే కొత్త కాలేజీలన్నింటినీ ఫ్యాకల్టీతో నింపేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. యుద్ధప్రాతిపదికన ఆదివారం 245 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించి...వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి కొత్త కాలేజీలకు పోస్టు చేసింది. అలాగే ఆ కాలేజీలకు ఒక్కొ చోట 14 మంది ఆచార్యులు అవసరం. అన్నింటా కలపి 112 మంది కావాలి. కానీ ప్రస్తుతం 57 మందికే ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందే అర్హత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 377 ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


నూతన వైద్య కళాశాలల కోసం డీపీసీ వేశారు. వారంలోపే ఈ కాలేజీలకు ఆచార్యులను నియమించే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్‌ కాలేజీల్లో 630 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 8 కాలేజీలకే 200 మంది కావాలి. అందుకే వచ్చే నెల్లో ఈ పోస్టుల భర్తీకి మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.


అనుమతులపై తుది నిర్ణయం త్వరలో వెల్లడి- ఎన్‌ఎంసీ

దేశవ్యాప్తంగా కొత్త మెడికల్‌ కాలేజీల 113 దరఖాస్తులు రాగా... అందులో ఒక్క తెలంగాణ నుంచే 11 వచ్చాయి. అందులో 8 సర్కారీవి కాగా మరో 3 ప్రైవేటుకు చెందినవి. అయితే ఈ కొత్త కాలేజీలన్నింటికి అనుమతులు వచ్చినట్లు సోషల్‌ మీడియా, కొన్ని ఎలకా్ట్రనిక్‌ మీడియాలో వార్తలు రావడంపై ఎన్‌ఎంసీ సోమవారం స్పందించింది. కాలేజీల అనుమతుల విషయాన్ని వాటికి మెయిల్‌ రూపంలో పంపామని, అన్నింటికి అనుమతులు ఇచ్చినట్లు వచ్చిన వార్తల్లో వాస్తం లేదని వెల్లడించింది. త్వరలోనే ఎన్ని కాలేజీలకు అనుమతులు ఇచ్చామో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని ఎన్‌ఎంసీ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.

Updated Date - Jul 09 , 2024 | 03:48 AM

Advertising
Advertising
<