Share News

సొంత గూటికి బాలేశ్వర్‌ గుప్తా

ABN , Publish Date - Mar 19 , 2024 | 12:17 AM

తాండూరులో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌ గుప్తా సోమవారం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

సొంత గూటికి బాలేశ్వర్‌ గుప్తా
కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరుతున్న ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా

తాండూరు: మార్చి 18: తాండూరులో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌ గుప్తా సోమవారం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. గతంలో బీజేపీలో పని చేసిన బాలేశ్వర్‌గుప్తా తర్వాత కాంగ్రెస్‌ నుంచి ఎంపీపీగా ఎన్నికై బీఆర్‌ఎస్‌లో చేరారు. తిరిగి సోమవారం సొంతగూటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం ఉన్నారు.

Updated Date - Mar 19 , 2024 | 12:17 AM