ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: మీ అందరిపై పరువు నష్టం దావా వేస్తా: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

ABN, Publish Date - Oct 05 , 2024 | 04:00 PM

తెలంగాణ రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని, ఎకరాకు రూ.15వేలు చొప్పున రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గతేడాది డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తానని సీఎం చెప్పారని కేటీఆర్ అన్నారు.

BRS Working President KTR

రంగారెడ్డి: తెలంగాణ రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని, ఎకరాకు రూ.15వేలు చొప్పున రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గతేడాది డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తానని సీఎం చెప్పారని కేటీఆర్ అన్నారు. 10నెలలు గడిచినా ఇంతవరకూ పూర్తి మాఫీ చేయలేదని మండిపడ్డారు. సీఎంగా మొదటి రోజే రుణమాఫీ ఫైలుపై సంతకం పెడతానని చెప్పారని, ఇటీవల రుణమాఫీ అంటూ ఉదరగొట్టారు తప్ప.. రైతులకు లబ్ధి చేకూర్చలేదని కేటీఆర్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు గుప్పించారు.


అందుకే ఓట్లు..

ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.." తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆరు గ్యారెంటీల పేరుతో రేవంత్ రెడ్డి ఎక్కడ దేవుడు కనిపిస్తే అక్కడ ఒట్లు వేశారు. అనంతరం అధికారంలోకి వచ్చి ప్రజలను నిలువునా మోసం చేశారు. ప్రజలు మోసం చేసే వారినే నమ్ముతారని రేవంత్ రెడ్డి ముందే చెప్పారు. రైతు బోనస్ పేరుతో రూ.500 ఇస్తామని చెప్పారు. రైతు భరోసా పేరిట ఏటా రూ.15వేలు ఇస్తామని అన్నారు. ఇప్పుడు రైతు బంధు.. రైతు భరోసా రెండూ లేకుండా చేశారు. రైతులను ఎటూ కాకుండా చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను ముఖ్యమంత్రి మోసం చేశారు. వృద్ధులు, మహిళలకు ఫించన్లు అన్నారు. బతుకమ్మ చీరలు ఇప్పటివరకూ ప్రజలకు ఇవ్వలేదు. అసలు బతుకమ్మ పంగడ పండగలా ఉందా?. ఇందిరమ్మ ఇళ్లు కడుతామని చెప్తే ప్రజలు ఓట్లు వేశారు. ఇళ్లు కూలగొడుతామంటే ఓట్లు వేయలేదు. పది నెలల్లో ఒక్క మంచి పనైనా చేశారా?.


ఫ్యూచర్ సిటీ కడతారట..

రుణమాఫీ చేసేందుకు డబ్బులు లేవని చెప్పే నేతలు రూ.1.50లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తారట. ప్రజలకు పథకాలు, మంచి చేస్తే కమీషన్లు రావు. మూసీ ప్రాజెక్టు అయితే రూ.25నుంచి రూ.30వేల కోట్లు దోచుకోవచ్చు. మూసీ ప్రక్షాళన అనేది కేవలం పైసలు కొట్టేయడానికే. పేదోళ్లను కొట్టి పార్టీ పెద్దలకు కమీషన్లు పంపి సీటు కాపాడుకోవటం కోసమే మూసీ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి చేపట్టారు. ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేస్తామంటూ ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పారు. మీకు ఎవరికైనా భూములు తిరిగి ఇచ్చారా?. ఉన్న సిటీని పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ కడతానని సీఎం చెప్తున్నారు. ఆర్ఆర్ఆర్‌కు సంబంధించి కేంద్రం వాటాతో పూర్తి చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఆర్ఆర్ఆర్ సౌత్ భాగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుందని సీఎం రేవంత్ చెప్తున్నారు. అప్పుడే కాంట్రాక్టుల పేరుతో భారీగా డబ్బులు దోచుకోవచ్చని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సహా ఆస్మదీయులకు కాంట్రాక్టులు ఇచ్చేందుకే సీఎంలా కాకుండా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా సీఎం వ్యవహరిస్తున్నారు.


వారిని వదలను..

మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి రేవంత్ ఆయన మంత్రుల మెదళ్లలోనే ఉంది. వారి గబ్బు మాటలను వదిలేది లేదు. నా మీద అడ్డగోలు మాట్లాడిన మంత్రిని వదిలిపెట్టను. క్రిమినల్ కేసుతోపాటు పరువునష్టం దావా వేస్తా. రేవంత్ రెడ్డి మీదా పరువు నష్టం దావా వేస్తా. గతంలో ప్రతిపక్షంలో ఉన్నారని ఏది మాట్లాడినా వదిలేశాం. ఇప్పుడు వదిలేది లేదు. తప్పు చేయని వారి గురించి పిచ్చి మాటలు మాట్లాడతామంటే ఊరుకునేది లేదు. ప్రధాని మోదీనే ఏం చేసుకుంటావో చేసుకో అన్నోళ్లం. ఈ చిట్టి నాయుడు(రేవంత్ రెడ్డి) ఎంత?, సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్‌లు ఎక్కడ ఉన్నాయో చెప్పండి, మేమే కూలగొడుతాం. బీఆర్ఎస్ నేతల ఇళ్లు కూలగొడితే మీ కడుపు మంట చల్లారుతుందంటే చెప్పండి వాటిని మేమే కూల్చుకుంటాం. కానీ పేదల ఇళ్లను వదిలిపెట్టండి. మూసీ బాధితుల గోస చూస్తుంటే బాధ అనిపిస్తోంది. 50 ఏళ్లపాటు వాళ్లు కట్టిన ట్యాక్సులు తిని ఇప్పుడు వారిని కబ్జాదారులు అంటున్నారు. నీకు పైసలు కావాలి, రాహుల్ గాంధీకి పంపించాలనే నీ బాధ మాకు అర్థమైంది. నీకు రూ.4 కోట్ల తెలంగాణ ప్రజలు చందాలు ఇస్తారు. కానీ పేదల ఇళ్లను మాత్రం కూలగొట్టకు. ప్రజలు ఇచ్చిన చందాలు తీసుకెళ్లి సీఎం సీటు కాపాడుకో.


పొంతనే లేదు..

రుణమాఫీ అందరికీ అందిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయ్యిందో లేదో మీ సొంత ఊళ్లో అడుగుదామని సవాల్ చేస్తే ఇంతవరకూ సమాధానం లేదు. రుణమాఫీ ముందుగా రూ.48వేల కోట్లు అన్నారు. క్యాబినెట్‌లో రూ.31వేల కోట్లు అని చెప్పారు. బడ్జెట్‌లో రూ.25వేల కోట్లు పెట్టారు. ఆ తర్వాత రూ.18వేల కోట్లు అన్నారు. వాళ్ల ఉప ముఖ్యమంత్రే ఏకంగా రూ.7,500కోట్ల రుణంమాఫీ చేశామని చెప్పారు. ఎక్కడ రూ.41వేల కోట్లు.. ఎక్కడి రూ.7,500కోట్లు. ఏమైనా సంబంధం ఉందా?. చారాణ రుణమాఫీ చేసి మొత్తం రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారూ.. ఇక రాష్ట్రంలో మీరు తిరిగే పరిస్థితి లేకుండా పోతుంది.

Updated Date - Oct 05 , 2024 | 04:00 PM