Seethakka: ప్రజలు బుద్ధి చెప్పినా అహంకారం తగ్గలేదు..
ABN, Publish Date - Aug 20 , 2024 | 06:08 AM
ప్రజలు బుద్ధి చెప్పినా కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదని పోలేదని, రాఖీ పండుగ రోజు కూడా మహిళా నేతలపై నిందలు చేయడం ఆయనకే చెల్లిందని మంత్రి సీతక్క విమర్శించారు.
మహిళా భద్రతపై మీతో చెప్పించుకునే స్థితిలో లేము
కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ప్రజలు బుద్ధి చెప్పినా కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదని పోలేదని, రాఖీ పండుగ రోజు కూడా మహిళా నేతలపై నిందలు చేయడం ఆయనకే చెల్లిందని మంత్రి సీతక్క విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు మహిళా భద్రతను గాలికొదిలేసి, ఇప్పు డు గాలి మాటలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.
మహిళా భద్రత విషయంలో వారితో చెప్పించుకోవాల్సిన స్థితిలో తాము లేమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హాయాంలో మహిళా భద్రత అంత లక్షణంగా ఉంటే, ఎనిమిదేళ్లలో లక్షన్నరకుపైగా నేరాలెందుకు జరిగాయని ప్రశ్నించారు. మహిళలపై అఘాయిత్యాల విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటూ సీతక్కను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు.
తమ ప్రభు త్వం మహిళా భద్రతకు పెద్దపీట వేస్తోందని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మహిళలపై జరిగిన దాడులను బయటకు రాకుండా తొక్కిపెట్టిన చరిత్ర బీఆర్‌ఎ్‌సదేనని ఆరోపించారు. మహిళలను రికార్డింగ్ డ్యాన్సర్లతో పోల్చడం చిన్న విషయం కాదని, కోట్ల మందిని కించపర్చడమేనని పేర్కొన్నారు.
Updated Date - Aug 20 , 2024 | 06:08 AM