Hyderabad: త్వరలోనే బీఆర్‌ఎస్ ఖాళీ..
ABN, Publish Date - Jun 22 , 2024 | 04:28 AM
బీఆర్‌ఎస్ నుంచి మరో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రె్‌సలో చేరనున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. బీఆర్‌ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు.
కేసీఆర్ విధానాలే ఆ పార్టీని ముంచాయి
మీడియాతో చిట్‌చాట్‌లో దానం నాగేందర్
కేసీఆర్, కేటీఆర్ తప్ప ఎవ్వరూ మిగలరు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ నుంచి మరో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రె్‌సలో చేరనున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. బీఆర్‌ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు. కేసీఆర్ విధానాలే బీఆర్‌ఎస్ పార్టీని ముంచాయన్నారు. ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ముఠా గోపాల్, సుధీర్‌రెడ్డి, వివేకానంద్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రకా్‌షగౌడ్ తదితరులు అతి త్వరలో కాంగ్రె్‌సలో చేరనున్నట్లు వెల్లడించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రె్‌సలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి, వ్యూహకర్త సునీల్ కనుగోలు రెండు, మూడు రోజులుగా చర్చలు జరుపుతున్నారన్నారు.
మరోవైపు.. హరీశ్‌రావుతో కలిసి కొందరు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అయోమయంలో పడిందని, ప్రమాదం నుంచి బయటపడే పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. బీఆర్‌ఎ్‌సలో కేసీఆర్, కేటీఆర్ తప్ప ఎవరూ మిగలరని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. కాంగ్రెస్ విధానాలు నచ్చి.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమపార్టీలో చేరుతున్నారన్నారు. తాము కూడా సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు వారిని తీసుకుంటున్నామని చెప్పారు. రాజకీయ అవసరాలను బట్టి పార్టీలో చేరికలు ఉంటాయని, నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరగబోదని భరోసా ఇచ్చారు.
Updated Date - Jun 22 , 2024 | 06:36 AM