ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vikarabad: గురుకుల విద్యార్థులకు అస్వస్థత

ABN, Publish Date - Aug 05 , 2024 | 04:17 AM

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. ఈ మధ్యనే వికారాబాద్‌ అనంతగిరిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పలువురు విద్యార్థులు పచ్చ కామెర్లకు గురవ్వగా, తాజాగా ఇదే పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు కామెర్లతో ఆస్పత్రిలో చేరారు.

  • ఒకచోట నలుగురు విద్యార్థులకు కామెర్లు

  • మరోచోట 15 మంది విద్యార్థినులకు జ్వరం

వికారాబాద్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. ఈ మధ్యనే వికారాబాద్‌ అనంతగిరిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పలువురు విద్యార్థులు పచ్చ కామెర్లకు గురవ్వగా, తాజాగా ఇదే పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు కామెర్లతో ఆస్పత్రిలో చేరారు. అలాగే బూరుగుపల్లి సమీపంలోని మరో సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన దాదాపు 20 విద్యార్థినులు జ్వరాలతో వికారాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో చేరారు.


విషయం తెలుసుకున్న కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. పాఠశాలలో పారిశుద్య సమస్య, పరిసరాల అశుభ్రత, నీటి కాలుష్యం వంటి సమస్యల కారణంగానే విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. వసతిగృహాల నిర్వహణపై అధికారులు దృష్టి సారిస్తేనే విద్యార్థులు ఆరోగ్యకర వాతావరణంలో చదువుకోగలరని అంటున్నారు.

Updated Date - Aug 05 , 2024 | 04:17 AM

Advertising
Advertising
<