ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ration card: రేషన్‌కార్డు లేకున్నా మాఫీ కుటుంబ నిర్ధారణ కోసమే..

ABN, Publish Date - Jul 16 , 2024 | 03:25 AM

రేషన్‌కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణం ఉన్న ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగదన్నారు.

  • ఆంధ్రజ్యోతితో మంత్రి తుమ్మల

  • రైతులెవరూ ఆందోళన చెందొద్దు

  • కేసీఆర్‌ హయాంలో చేసింది సగమే..

  • అదీ ఐదేళ్ల తర్వాత మాఫీ చేశారు

  • మేం తొలి పంట నాటికే, ఒకేసారి చేస్తున్నాం

  • ‘ఆంధ్రజ్యోతి’తో వ్యవసాయ మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రేషన్‌కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణం ఉన్న ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగదన్నారు. సోమవారం రుణమాఫీ విధివిధానాలను విడుదల చేసిన తర్వాత వాటిపై వచ్చిన పలు అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. తెల్లకార్డు లేకపోయినా.. బ్యాంకుల్లో రుణం ఉంటే రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. తమ దగ్గర అందరి వివరాలు ఉన్నాయన్నారు.


తెల్లకార్డు అనేది కుటుంబ నిర్ధారణ కోసం మాత్రమేనని, కార్డు లేని వారికి సంబంధించి వ్యక్తిగతంగా విచారణ చేపడతామని చెప్పారు. అయితే ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారు? ఎవరి పేరు మీద ఎంత రుణం ఉందనే వివరాలను పరిశీలించి కుటుంబం మొత్తానికి కలిపి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తేల్చిచెప్పారు. తెల్లకార్డు ఉన్నా లేకపోయినా రుణమాఫీ చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని హామీచ్చారు. రూ.31 వేల కోట్ల మేర మాఫీని ఏకమొత్తంలో చేస్తున్నామన్నారు.


కేసీఆర్‌ చేసింది సగమే..

గత ప్రభుత్వ హయాంలో రూ.లక్ష రుణమాఫీకి సంబంధించి బీఆర్‌ఎస్‌ తొలిసారి (2014-18) ఏటా రూ.25 వేల చొప్పున నాలుగేళ్లు చేసిందని, అయితే అది వడ్డీలకే సరిపోయిందని తుమ్మల అన్నారు. తర్వాత 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్‌ మళ్లీ రూ.లక్ష మాఫీ చేస్తామని ప్రకటించినా.. ఐదేళ్లపాటు చేయలేదని గుర్తుచేశారు. 2023లో ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు ఓఆర్‌ఆర్‌ను లీజుకిస్తే వచ్చిన డబ్బుతో రుణమాఫీ చేశారని తెలిపారు. మొత్తం రుణమాఫీకి రూ.20 వేల కోట్లు అవసరమవ్వగా, రూ.13 వేల కోట్లే విడుదల చేశారని చెప్పారు. అందులోనూ మళ్లీ రూ.1,400 కోట్ల నగదు రైతులు రెన్యువల్‌ చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి వెనక్కి వచ్చిందని, ఆ నిధులను రైతులకు అందించలేదని విమర్శించారు.


అంటే ఐదేళ్ల తర్వాత వాళ్లు మాఫీ చేసింది రూ.11 వేల కోట్లేనన్నారు. దీనివల్ల తమ ప్రభుత్వంపై రూ.10 వేల కోట్ల భారం పడుతోందని చెప్పారు. అయినప్పటికీ గతం నుంచి రుణాలున్న రైతులకు కూడా రూ.2 లక్షల మేర మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌ సర్కారు తరహాలో ఐదేళ్లలో కాకుండా ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తున్నామని, అది కూడా తొలి పంట కాలంలోనే పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు నీతులు చెప్పడం సరికాదని, ప్రజలు వారిని నమ్మడం లేదని చెప్పారు.

Updated Date - Jul 16 , 2024 | 03:25 AM

Advertising
Advertising
<