ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pharma Clusters: మూడు జిల్లాల్లో 4200 ఎకరాలు!

ABN, Publish Date - Aug 12 , 2024 | 04:20 AM

గ్రీన్‌ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి, భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తోంది.

  • గ్రీన్‌ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్లకు మెదక్‌,

  • నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో భూసేకరణ

  • ఇప్పటికే భూముల గుర్తింపు పూర్తి

  • ఏడాదిలోపు సేకరణకు ప్రభుత్వ ప్రణాళిక

  • ముచ్చర్లలో 1500 ఎకరాల్లో మరో క్లస్టర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): గ్రీన్‌ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి, భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తోంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన 10 ఫార్మా క్లస్టర్లు అంతర్జాతీయ విమానాశ్రయానికి 60 కిమీల లోపే ఉన్నాయని, పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమని చెబుతోంది.


ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆయా కంపెనీలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే వికారాబాద్‌ జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. మెదక్‌, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి మొత్తం 4203 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కానుంది. మొత్తం పది క్లస్టర్లలో భూసేకరణ ప్రక్రియను ఏడాదిలోగా పూర్తి చేయాలన్నది ప్రభుత్వంలక్ష్యంగా తెలిసింది.


  • సిద్ధంగా ఉన్న కంపెనీలకు ముచ్చర్ల..

రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని దాదాపు 20వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటుచేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఒకేచోట అంత పెద్దఎత్తున ఫార్మా పరిశ్రమ ఏర్పాటును ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలోని 10 వేర్వేరు ప్రాంతాల్లో 1000-2000 ఎకరాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేయనుంది. అయితే ముచ్చర్ల ఫార్మాసిటీలో ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 9వేల ఎకరాల భూమిని సేకరించింది.


ఇందులో వివిధ రకాల ప్రాజెక్టులను అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడే 1000-1500 ఎకరాల్లో మరో గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్‌ ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది. అయితే, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలకు ముచ్చర్ల క్లస్టర్‌లో భూమి కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, సీఎం అమెరికా పర్యటనలో ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్న సంస్థలకు కూడా ముచ్చర్లలోనే భూములు కేటాయించే అవకాశాలున్నాయి.


  • మెదక్‌ జిల్లాలో 900 ఎకరాల్లో భూముల పరిశీలన..

గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్ల కోసం మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలంలో భూముల పరిశీలన ప్రారంభమైంది. అచ్చంపేట గ్రామంలోని సర్వే నెంబర్లు 60 నుండి 86 వరకు, 115, 129 130 సర్వే నెంబర్లలో 629 ఎకరాలు, హకీంపేటలోని 12, 17, 19, 20, 95 సర్వేనెంబర్లలో నుండి 150 ఎకరాలు, రామంతపూర్‌లోని 389 సర్వే నెంబర్‌లో 120 ఎకరాలు మొత్తంగా 900 ఎకరాలను అధికారులు ఇటివలే పరిశీలించారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత భూసేకరణ చేపడతారు.


  • వికారాబాద్‌లో 1373 ఎకరాల్లో..

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని దుద్యాల మండలం, లగచర్ల, పోలేపల్లి, హకీంపేట గ్రామాల పరిధిలోని 1373 ఎకరాల్లో ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా లాగచర్లలో 632.26 ఎకరాలను 580 మంది రైతుల నుంచి సేకరించేందుకు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.


  • త్వరలో నల్లగొండలో

నల్లగొండ జిల్లాలో 1300 ఎకరాల భూసేకరణ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. చిట్యాల మండలం వెలిమినేడ్‌ గ్రామ శివారులో గత సర్కారు ఇండస్ర్టియల్‌ పార్క్‌కు ప్రతిపాదించిన 300 ఎకరాల ప్రభుత్వ భూమి సిద్ధంగా ఉంది. మరో 500 ఎకరాల అసైన్డ్‌ భూమి అందుబాటులో ఉంది. అదనంగా మరో 500 ఎకరాల వరకు పట్టా భూములను సేకరించాలని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Aug 12 , 2024 | 08:13 AM

Advertising
Advertising
<