ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

School Meals: ‘సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ల’తో మధ్యాహ్న భోజనం

ABN, Publish Date - Jul 29 , 2024 | 02:51 AM

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్‌ కిచెన్‌లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయాన్నే అల్పాహారం కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తోంది.

  • పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం కూడా

  • పైలట్‌ ప్రాజెక్టుగా కొడంగల్‌లో.. తర్వాత రాష్ట్రమంతా అమలు

  • ఫౌండేషన్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌/కొడంగల్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్‌ కిచెన్‌లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయాన్నే అల్పాహారం కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. కొడంగల్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టి, ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. హరే రామ-హరే కృష్ణ చారిటబుల్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. అలాగే, వివిధ కంపెనీల కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎ్‌సఆర్‌) నిధులను సైతం ఇందుకోసం వినియోగించుకోవాలని యోచిస్తోంది.


ఈ మేరకు హరే రామ-హరే కృష్ణ చారిటబుల్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు. కొడంగల్‌లో సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ పనులు పూర్తయిన వెంటనే.. ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 28 వేల మంది విద్యార్థులకు రోజూ ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్న భోజనం అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని సూచించారు.


  • నూతన గవర్నర్‌ జిష్ణుకు స్వాగతం

తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన జిష్ణుదేవ్‌ వర్మకు ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ‘ఎక్స్‌’లో సీఎం పోస్ట్‌ చేశారు.


  • మన సంస్కృతిని కాపాడుకుందాం: సీఎం రేవంత్‌

వేల ఏళ్ల నాటి సంస్కృతి-సంప్రదాయాలను పరిరక్షిస్తూ ప్రపంచపటంలో తెలంగాణ తన ప్రత్యేకతను నిలుపుకొంటోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్‌ షాహీలు తదితరులు ఈ ప్రాంతాన్ని పరిపాలించి తమదైన వారసత్వ సాంస్కృతిక ముద్రను వేశారని తెలిపారు. ఆదివారం కుతుబ్‌షాహీ టూంబ్స్‌లో సాంస్కృతిక శాఖ, ఆగాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ పనుల ముగింపు కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందల, వేల ఏళ్ల నాటి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో నిండిన తెలంగాణ సమ్మిళిత సంస్కృతిని కాపాడుకోవాలన్నారు.


చార్మినార్‌, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధులు, పాయిగా సమాధులు, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలంపూర్‌ దేవాలయాలు చారిత్రక అద్భుతాలని చెప్పారు. శతాబ్దాలుగా హైదరాబాద్‌ ‘గంగా-జమునా తెహజీబ్‌’గా బహుళ జాతులు, సంస్కృతుల సామరస్యాన్ని, సహజీవనానికి నిదర్శనంగా నిలుస్తోందని తెలిపారు. శతాబ్దాల క్రితం నాటి కుతుబ్‌షాహీ సమాఽధులను శిథిలావస్థ నుంచి పరిరక్షించేందుకు 2013లో ఆగాఖాన్‌ ట్రస్ట్‌ చేపట్టిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం విశేషమన్నారు. సుమారు 106 ఎకరాల విస్తీర్ణంలోని నిర్మాణాలను గుర్తించి, వాటికి పూర్వవైభవాన్ని చేకూర్చిన ఆగాఖాన్‌ ట్రస్ట్‌ ప్రతినిధులను, సాంకేతిక నిపుణులను రేవంత్‌రెడ్డి అభినందించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రపంచ పర్యాటకులకు తెలంగాణను ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ అసదుద్దీన్‌ మాట్లాడుతూ.. గోల్కొండ టూంబ్స్‌ పునరుద్ధరణ పనులు పూర్తి చేసిన ఆగాఖాన్‌ ట్రస్ట్‌కే వాటి నిర్వహణ బాధ్యతలూ అప్పగించాలని కోరారు.

Updated Date - Jul 29 , 2024 | 02:51 AM

Advertising
Advertising
<