ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD: టీటీడీకి ఇచ్చే నెయ్యిలో చేప నూనె

ABN, Publish Date - Sep 20 , 2024 | 04:29 AM

టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కుళ్లిపోయిన జంతువుల కొవ్వు, చేప నూనె కలిపారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.

  • గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, మైదానూ కలిపారు

  • కమీషన్లకు కక్కుర్తిపడే వైసీపీ నేతల అక్రమాలు

  • జగన్‌, కరుణాకర్‌, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలను ఉరి తీయాలి

  • టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజం

  • నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు నివేదికలు విడుదల

నెల్లూరు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కుళ్లిపోయిన జంతువుల కొవ్వు, చేప నూనె కలిపారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డు ల్యాబొరేటరీ పరీక్షల్లో ఇది నిర్ధారణ అయిందని తెలిపారు. గురువారం నెల్లూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘వైసీపీ హయాంలో టెండర్‌ పిలిచి కిలో నెయ్యి రూ.320కే సరఫరా చేసేలా నలుగురికి కాంట్రాక్ట్‌ అప్పగించారు. మార్కెట్‌లో రూ.1000 వరకు ధర ఉంటే.. ఇంత తక్కువ ధరకు ఎవరైనా సరఫరా చేయగలరా? ఇందులో భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి పాత్రధారులు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లడ్డూలు, ప్రసాదాలు, భోజనాలు ఎందుకు బాగాలేవో అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమించింది. ఏఆర్‌ ఫుడ్స్‌ అనే కంపెనీ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది.


ఇక్కడినుంచి వచ్చిన ఒక ట్రక్కు నెయ్యిని నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డ్‌ ల్యాబ్‌కు పరీక్షకు పంపారు. 52 ఐటమ్స్‌ను అక్కడ అనాలసిస్‌ చేసి రిపోర్ట్‌ ఇచ్చారు. ఈ నెయ్యిలో సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ సీడ్‌, మైదా, కోకోనట్‌తో పాటు చేప నూనె కూడా ఉన్నట్లు రిపోర్టులో తేలింది. అలానే పామాయిల్‌, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు కలిసినట్లు నిర్ధారణ అయింది. ఈ నెయ్యిని పరీక్షించేటప్పుడు ‘ఎస్‌’ వాల్యూను చూస్తారు. నాణ్యమైన నెయ్యికి ‘ఎస్‌’ విలువ 95.8 నుంచి 104.32 మధ్య ఉండాలి. కానీ ఇక్కడ ఒక శాంపిల్‌ విలువ 19.72 ఉంది. మరో శాంపిల్‌లో 19.77 వాల్యూ వచ్చింది. అంటే ఒరిజినల్‌ నెయ్యి నాణ్యతలో 20శాతం కూడా లేదని తేలింది. గొడ్డు మాంసం, చేప నూనె, కుళ్లిపోయిన జంతువుల నూనె వాడినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. వేంకటేశ్వరస్వామి ప్రసాదాల్లో కుళ్లిపోయిన జంతువుల నుంచి తీసిన నెయ్యిని వాడతారా..? ఇది ఎంత అన్యాయం..? ఇదేనా వైసీపీ పాలన..?’ అని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఎన్‌డీడీబీ నివేదిక ప్రతులను ప్రదర్శించారు.


  • దేవుడు క్షమించడు: సంజయ్‌ జగన్‌ను అరెస్టు చేయాలి: రాజాసింగ్‌

హైదరాబాద్‌/మంగళ్‌హాట్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపిన వారిని దేవుడు క్షమించడని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. పవిత్రమైన ప్రసాదాన్ని కల్తీ చేయడమంటే కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీయడమేనన్నారు. ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుని, తక్షణం సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు. తిరుపతి విషయంలో ఇంత దారుణానికి ఒడిగట్టిన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డిని వెంటనే అరెస్ట్‌ చేయాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సెల్ఫీ వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Updated Date - Sep 20 , 2024 | 07:57 AM