ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: స్మార్ట్‌ సిటీల గడువు పొడిగింపు..

ABN, Publish Date - Jul 01 , 2024 | 02:50 AM

తెలంగాణలో అమలవుతున్న స్మార్ట్‌ సిటీ మిషన్‌ గడువును కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 31 వరకు పొడిగించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. నిజానికి, స్మార్ట్‌ సిటీ మిషన్‌ గడువు ఆదివారంతోనే ముగిసింది.

  • పనుల పూర్తికి వచ్చే మార్చి 31 దాకా అవకాశం

  • జాబితాలో రాష్ట్రంలోని వరంగల్‌, కరీంనగర్‌

  • కొత్త పనులు ఇవ్వరు.. పాతవే పూర్తి చేయాలి..

  • మ్యాచింగ్‌ నిధులిచ్చి అభివృద్ధికి సహకరించాలి

  • కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

  • అభివృద్ధికి సహకరించాలి: బండి సంజయ్‌

హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంరఽధజ్యోతి) : తెలంగాణలో అమలవుతున్న స్మార్ట్‌ సిటీ మిషన్‌ గడువును కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 31 వరకు పొడిగించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. నిజానికి, స్మార్ట్‌ సిటీ మిషన్‌ గడువు ఆదివారంతోనే ముగిసింది. ఇటీవల ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో సమావేశమయ్యారు. స్మార్‌ ్ట సిటీ మిషన్‌ కింద రాష్ట్రంలో చేపట్టిన పనులు పూర్తికాకపోవడంతో వచ్చే ఏడాది జూన్‌ వరకు గడువును పెంచాలని కోరారు. సీఎం విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రం.. మిషన్‌ గడువును వచ్చే ఏడాది మార్చి 31వరకు పెంచుతున్నట్టు శనివారమే రాష్ట్రానికి లేఖ రాసింది.


అదే విధంగా స్మార్ట్‌ సిటీ మిషన్‌కు ఎంపికైన ఇతర రాష్ట్రాలకు కూడా గడువు పొడిగింపుపై లేఖలు పంపింది. అయితే, కొత్త పనులు మంజూరు చేయమని, ఇప్పటికే ఆమోదించి చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబరులో విడుదల చేస్తామని పేర్కొంది. రాష్ట్రంలోని వరంగల్‌, కరీంనగర్‌ నగరాలు స్మార్ట్‌ సిటీ మిషన్‌ కింద ఎంపికయ్యాయి. వరంగల్‌లో మొత్తం 101 పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 45 పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.518కోట్లతో మరో 66 పనులు కొనసాగుతున్నాయి. కరీంనగర్‌లో మొత్తం 47 పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 25పనులు పూర్తవ్వగా, రూ.287కోట్లతో మరో 22 పనులు కొనసాగుతున్నాయి.


వరంగల్‌, కరీంనగర్‌ అభివృద్ధి: సంజయ్‌

స్మార్ట్‌ సిటీ మిషన్‌ గడువును కేంద్రం దేశ వ్యాప్తం గా పొడిగించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కరీంనగర్‌, వరంగల్‌ నగరాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్మార్ట్‌ సిటీ నిధులను విడుదల చేయాలని గతంలో తాను మూడు సార్లు ప్రభుత్వానికి లేఖలు రాశానని గుర్తు చేశారు. కరోనా వల్ల రెండేళ్లు పనులు ఆగిపోవడంతో స్మార్ట్‌ సిటీ మిషన్‌ గడువును పొడిగించాలని కోరామని చెప్పారు. స్మార్ట్‌ సిటీ నిధులు దారి మళ్లకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.


అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కింద మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిధులను సకాలంలో విడుదల చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. గత ప్రభుత్వం స్మార్ట్‌ సిటీ మిషన్‌ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. గత పాలకులు కమీషన్లకు ఆశపడడంవల్లే పనులు జాప్యమయ్యాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. స్మార్ట్‌ సిటీ నిధుల వినియోగంలో జరిగిన అవకతవకలు, కమీషన్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 01 , 2024 | 02:50 AM

Advertising
Advertising