TG politics: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కీలక నేత బీజేపీలోకి జంప్..!
ABN, Publish Date - Mar 17 , 2024 | 09:22 AM
తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కు ప్రస్తుతం గ్రహస్థితి అనుకూలిస్తున్నట్లు లేదు. ఓవైపు కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీనియర్ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్, బీజేపీ(BJP)లో చేరుతున్నారు. ఇప్పటికే నాగర్‌కర్నూల్, జహీరాబాద్ ఎంపీలు రాములు, బీబీ పాటిల్‌తో పాటు మరికొంతమంది సీనియర్లు బీజేపీలో చేరగా.. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లో చేరారు.
తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కు ప్రస్తుతం గ్రహస్థితి అనుకూలిస్తున్నట్లు లేదు. ఓవైపు కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీనియర్ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్, బీజేపీ(BJP)లో చేరుతున్నారు. ఇప్పటికే నాగర్‌కర్నూల్, జహీరాబాద్ ఎంపీలు రాములు, బీబీ పాటిల్‌తో పాటు మరికొంతమంది సీనియర్లు బీజేపీలో చేరగా.. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సైతం బీజేపీలో చేరబోతున్నారు. తాను కాషాయ కండువా కప్పుకుంటానని గతంలోనే ఆయన ప్రకటించారు. మూడు రోజులు క్రితం చోటుచేసుకున్న హైడ్రామాతో ఆయన చేరిక వాయిదా పడింది. ఆయన బీజేపీలో చేరొద్దంటూ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్, హరీష్‌రావులు ఆరూరి రమేష్‌ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ను కలిసిన తర్వాత తాను బీఆర్ఎస్(BRS)లోనే ఉన్నానని రమేష్ ప్రకటించారు.
తాజాగా ఎన్నికల షెడ్యూల్(Election Schedule) విడుదల కావడంతో తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీ మారాలని ఆరూరి డిసైడ్ అయ్యారు. ఈరోజు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి నేతృత్వంలో రమేష్ బీజేపీలో చేరనున్నారు.
వరంగల్ టికెట్ ఆయనకే..!
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా 15 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. రెండో జాబితా ప్రకటనకు ముందే ఆయన బీజేపీలో చేరి ఉంటే రమేష్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని బీజేపీ భావించింది. చివరి క్షణంలో ఆయన చేరిక వాయిదా పడతంతో ఆస్థానాన్ని పెండింగ్‌లో పెట్టింది. బీజేపీలో ఆరూరి చేరిక ఖాయం కావడంతో మూడో జాబితాలో ఆయనను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 17 , 2024 | 01:08 PM