Share News

Minister Seethakka: వెయ్యి పశువులు తిన్న రాబంధు నీతి కథలు చెప్పినట్టుగా కేటీఆర్ వ్యవహారం..

ABN , Publish Date - Jan 20 , 2024 | 01:54 PM

Telangana: మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. వెయ్యి పశువులను తిన్న రాబంధు నీతి కథలు చెప్పినట్టు కేటీఆర్ వ్యవహారం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.

Minister Seethakka: వెయ్యి పశువులు తిన్న రాబంధు నీతి కథలు చెప్పినట్టుగా కేటీఆర్ వ్యవహారం..

హనుమకొండ, జనవరి 20: మాజీ మంత్రి కేటీఆర్‌పై (Former Minister KTR) మంత్రి సీతక్క (Minister Seethakka) ఆగ్రహం వ్యక్తం చేశారు. వెయ్యి పశువులను తిన్న రాబంధు నీతి కథలు చెప్పినట్టు కేటీఆర్ వ్యవహారం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్‌లకు నిధులు ఇవ్వకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం (BRS Government) ఘోష పెట్టిందన్నారు. కేటీఆర్ ఇప్పుడు సర్పంచ్‌ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం సర్పంచ్‌లను వేధించిందన్నారు. నిధులు మంజూరు చేయకపోవడంతో సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. త్వరలోనే సర్పంచ్‌లకు రావాల్సిన నిధులన్నీ విడుదల చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Jan 20 , 2024 | 01:54 PM

News Hub